శాతకర్ణి ఆడియో మళ్లీ పోస్ట్ పోన్?

Update: 2016-12-09 06:15 GMT
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి.. పోస్ట్ పోన్ ల పర్వం కొనసాగుతోంది. మొదట ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా 100 థియేటర్లలో ఒకే రోజున విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజున మెజారిటీ థియేటర్స్ అన్నిటిలోను ధృవ రిలీజ్ కి షెడ్యూల్ కావడంతో.. మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్ రాకుండా ఉండేందుకు ట్రైలర్ రిలీజ్ వాయిదా వేసుకున్నారు.

ఇప్పుడు ట్రైలర్ విషయంలోను వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న తిరుపతిలో గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి గౌతమిపుత్ర శాతకర్ణికి ఆడియో వేడుకను చేయాలని నిర్ణయించారు. ఈ పండుగకు అటు ఏపీ సీఎం చంద్రబాబునాయడుతో పాటు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కూడా ఆహ్వానించారు. కానీ.. వీరిద్దరికీ డిసెంబర్ 16న ఫంక్షన్ హాజరయ్యే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. వీరితో పాటు శాతకర్ణి తల్లిగా నటించిన బాలీవుడ్ కి అలనాటి డ్రీమ్ గాళ్ హేమమాలిని కూడా.. ఈ డేట్ విషయంలో సారీ చెప్పేశారట.

దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆడియో రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 22 నుంచి 24.. ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున శాతకర్ణి ఆడియో వేడుక జరగనుంది. ఈ వాయిదాల పర్వంలో నందమూరి ఫ్యాన్స్ కు లభించే ఒకే ఒక ఊరట ఏంటంటే.. డిసెంబర్ 16న గౌతమిపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్ ను మాత్రం రిలీజ్ చేశాయలని నిర్ణయించారట బాలయ్య-క్రిష్.
Tags:    

Similar News