ఏముంది ఈ ట్రైలర్లో.. ముద్దులు.. ఇంటిమేట్ సీన్లు తప్ప..? రొమాన్స్ తప్ప ఫీల్ ఏదీ..? అసలు సినిమాలో ఏమైనా ఎమోషన్ ఉన్నట్లుందా..? అసలు ఆ వాణీ కపూర్ ఏంటి అలా తయారైంది..? అంటూ చాలా నెగెటివ్ కామెంట్లు పడ్డాయి ‘బేఫికర్’ ట్రైలర్ చూడగానే. కానీ డివైడ్ టాక్ తో మొదలైన సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సంపాదించినట్లుగా.. ఈ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. కేవలం 48 గంటల్లో కోటిన్నర మంది ఈ ట్రైలర్ వీక్షించడం విశేషం.
బాలీవుడ్లో అతి తక్కువ టైంలో ఇన్ని వ్యూస్ సంపాదించిన ట్రైలర్లలో ఇదొకటి. ఒక మామూలు రొమాంటిక్ మూవీ ట్రైలర్ కు ఈ స్థాయిలో వ్యూస్ రావడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే ట్రైలర్ ఓవరాల్ గా ఎలా ఉందన్న విషయం పక్కనబెడితే.. ఇందులో లెక్కకు మిక్కిలిగా ఉన్న ముద్దులు.. రణ్వీర్ సింగ్-వాణీ కపూర్ కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తున్నట్లున్నాయి. అందుకే ఈ ట్రైలర్ బాగా చూస్తున్నట్లున్నారు.
‘దిల్వాలే దుల్హానియా లే జాయేంగే’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్య చోప్రా.. ఇప్పటిదాకా తీసింది మూడే మూడు సినిమాలు. ‘రబ్ నే బనాదె జోడీ’ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇది. ముందు నుంచి కేవలం ముద్దులతోనే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ వస్తోంది. ఇప్పుడు ట్రైలర్లోనూ అవే చూపించారు. డిసెంబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/