నిర్మాత బెల్లంకొండ సురేష్ హీరోయిన్లకు భలే ఆఫర్లిస్తుంటాడు. ఆమధ్య తన తనయుడి తొలి సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నందుకుగానూ సమంతకి భారీగా పారితోషికం ఇచ్చాడని చెప్పుకొన్నారు. ఆమెకి ఓ ఫామ్ హౌస్ కూడా రాసిచ్చాడని అప్పట్లో ఫిల్మ్ నగర్ లో పెద్దయెత్తున ప్రచారం సాగింది. అయితే సమంత మాత్రం ఆ వార్తల్ని తోసిపుచ్చింది. అందులో తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ చేయించారు. ఆమెకి కూడా అరకోటి పైగానే పారితోషికం ఇచ్చారని తెలిసింది. సమంత, తమన్నాలాంటి హీరోయిన్లు నటించడంతో ఆ సినిమాకి భారీగా క్రేజ్ వచ్చింది. బెల్లకొండ తనయుడు శ్రీనివాస్ ఎంట్రీ అదిరిపోయింది కానీ... ఆ తర్వాత మాత్రం ఆ ఊపును కంటిన్యూ చేయలేకపోయాడు. రెండో సినిమాకి భారీగా విరామం వచ్చింది. ఇక నుంచి మాత్రం మళ్లీ ఎగ్రెసివ్ గా తన కొడుకుతో సినిమాలు చేయించాలని బెల్లంకొండ డిసైడైనట్టు తెలుస్తోంది. ఆ మేరకు మునుపటిలాగే హీరోయిన్లకి క్రేజీగా ఆఫర్ చేస్తున్నాడట.
అల్లుడు శీనుగా అలరించిన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుందరపాండియన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. ఇదివరకు గుండె జారి గల్లంతయ్యిందే - ఒక లైలా కోసంలాంటి సినిమాల్ని చేశాడు విజయ్ కుమార్ కొండా. ఆయన చెప్పిన కథ నచ్చడంతో బెల్లంకొండ సురేష్ మరోసారి భారీగా సినిమా తీయాలనుకొంటున్నాడట. అందుకే తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని కథానాయికగా నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు రకుల్ కోటి రూపాయలుదాకా పారితోషికం తీసుకుంటోంది. అయితే తన కొడుకు సరసన నటించడానికి కోటిన్నర పారితోషికం ఆఫర్ చేసాడట బెల్లంకొండ. దాంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకొంటున్నారు.