విభిన్నమైన చిత్రాలతో తమిళంలో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో విష్ణు విశాల్. దీంతో అతని నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.
తను నటించిన `రాక్షసన్` తెలుగులో `రాక్షసుడు` పేరుతో రీమేక్ అయిన సూపర్ హిట్ కావడంతో విష్ణు విశాల్ చిత్రాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన నటించిన తాజా చిత్రం `ఎఫ్ ఐ ఆర్` కు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించారు.
ఓ అమాయకుడైన ముస్లీమ్ యువకుడిని తీవ్రవాదిగా చిత్రీకరిస్తే తను ఎలాంటి పోరాటం చేశాడు? .. ఎలా ఎదురు తిరిగాడన్న కథ, కథనాలతో ఈ చిత్రాన్ని ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మంజిమ మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. వివాదాస్సద కథాంశంతో టెర్రరిజమ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
హీరో రవితేజతో కలిసి అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ శుక్రవారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలైంది.
దర్శకుడు ఆనంద్ శంకర్ కథ అందించిన ఈ మూవీకి రిలీజ్ రోజే బిగ్ షాక్ తగిలింది. ట్రైలర్ తో సినిమాపై భారీ క్రేజ్ క్రియేట్ కావడంతో ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్ గా భారీ గా వుంటాయని ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే వారి అంచనాలని తలకిందులు చేస్తూ ఈ మూవీకి కొన్ని దేశాల్లో బిగ్ షాక్ తగిలింది.
మలేషియా, కువైట్ , ఖతర్ వంటి దేశాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసి షాకిచ్చారు. ఈ సినిమా కోసం ఎంచుకున్న కోర్ కంటెంట్, కథకు ఎంచుకున్న ప్రధాన థీమ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఆయా దేశాలు ఈ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శనకు అనర్హంగా ప్రకటిస్తూ బ్యాన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.