తెలుగు బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు అయ్యింది. సీజన్ 4 కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయినా కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుని నిర్వాహకులకు మంచి లాభాలనే తెచ్చి పెట్టిందనేది టాక్. అందుకే ఈ ఏడాది కూడా మిస్ చేయకుండా సీజన్ 5 ను మొదలు పెట్టాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాదికి బిగ్ బాస్ ఉండక పోవచ్చు అనే ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉంటుంది. బిగ్ బాస్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరుగుతుందని స్టార్ మా వర్గాల వారు చెబుతున్నారు. కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గత సీజన్ సమయంలో 20 రోజుల క్వారెంటైన్ కంటెస్టెంట్స్ ను ఉంచి ఆ తర్వాత హౌస్ లోకి కంటెస్టెంట్స్ ను తీసుకు వెళ్లడం జరిగింది. ఈసారి కూడా కంటెస్టెంట్స్ ను క్వారెంటైన్ లో ఉంచడం తో పాటు వ్యాన్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక గత సీజన్ ప్రారంభం అవ్వాల్సిన సమయం కంటే రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ 4 మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ మొదటి వారంలో టెలికాస్ట్ అయ్యింది. డిసెంబర్ లో ఫైనల్ ఎపిసోడ్ జరిగింది.
ఈసారి కూడా సెప్టెంబర్ మొదటి వారంలోనే సీజన్ 5 ను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అప్పటి వరకు థర్డ్ వేవ్ విషయమై ఒక క్లారిటీ వస్తుందని.. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు పూర్తి జాగ్రత్తలు తీసుకుని చేస్తున్న షో కనుక ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చు అనే ఉద్దేశ్యంతో నిర్వాహకులు ఉన్నారు. ఇక ఈ సీజన్ హోస్ట్ విషయంలో చర్చ జరుగుతోంది.
మొన్నటి వరకు నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతారనే వార్తలు వచ్చాయి. కాని రానా ను కొత్తగా హోస్ట్ గా తీసుకు వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని కూడా పుకార్లు షికార్లు చేశాయి. రానా విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. కనుక నాగార్జున నే హోస్ట్ గా కంటిన్యూ అవుతాడనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో హోస్ట్ విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.. సెప్టెంబర్ నెలలో షో ను మొదలు పెట్టే అవకాశం ఉందట.