బిగ్ బాస్ రెండు వారాలు గడిచిపోయాయి. మూడో వారంలోకి అడుగిడింది. తొలి రెండు వారాల్లో సామాన్యులుగా ఇంటిలోకి అడుగుపెట్టిన సంజన, నూతన్ నాయుడులు ఇంటినుంచి వెళ్లిపోయారు. తాజాగా సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఈసారి మరో సామాన్యుడు గణేష్ ను అందరూ టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసేందుకు నామినేట్ చేయడం దుమారం రేపుతోంది. సెలెబ్రెటీలు .. కామన్ మ్యాన్లను టార్గెట్ చేసి వారిని బయటకు పంపుతున్న వైనం ఇప్పుడు సంచలనమవుతోంది.. లక్షల మంది ఆడిషన్స్ నిర్వహించి ముగ్గురు సామాన్యులను సెలెబ్రెటీలుతో పాటు హౌస్ లోకి పంపితే.. రెండు వారాలు తిరక్క ముందే ఇద్దరు సామాన్యుల్ని బయటకు పంపేసిన వైనం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా గణేష్ ను ఇంటిసభ్యులు టార్గెట్ చేయడం చూశాక.. ఇందులో ఏదో మతలబు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.
బిగ్ బాస్ లో తొలి రెండు వారాలు చూస్తే.. సామాన్యుడు గణేష్ ఎలాంటి వివాదాలకు పోలేదు. ఎలిమినేట్ అయ్యేంతగా ఎవరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకోవడం లేదు. ఇప్పటివరకూ ఎవరిపై చాడీలు చెప్పింది లేదు.. కానీ గణేష్ ను నామినేట్ చేసేశారు. ఇందుకు సెలెబ్రెటీలు చెప్పిన కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయి. గణేష్ మానసికంగా ధృడంగా లేడని.. అతడు హౌస్ లోనే చిన్నవాడని.. అలా డల్ గా ఉంటే చూడలేకపోతున్నామని.. ఆ బాధపడేకంటే బయటకు పంపించేయడమే మేలని టార్గెట్ చేయడం విస్తు గొలుపుతోంది.
నిజానికి బిగ్ బాస్ నుంచి బయటకు పంపించే ప్రక్రియ మొత్తం ప్రేక్షకుల ఓట్లను బట్టి జరుగుతుంటుంది. కానీ నామినేట్ చేసే హక్కు మాత్రం ఇంటిసభ్యులదే.. అందుకే బలమైన కంటెస్టెంట్ల మధ్య సామాన్యులను నామినేట్ చేయడంతో వారు ఓటింగ్ లో సులువుగా ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ప్రేక్షకులు ఇచ్చే ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందని చెప్పినా.. బిగ్ బాస్ స్ర్కిప్ట్ ప్రకారమే కామన్ మ్యాన్లను బయటకు పంపుతున్నారన్న ప్రచారం పెరిగిపోతోంది. మూడో వారం కూడా కామన్ మ్యాన్ గణేష్ ను సెలెబ్రెటీలు ఎలిమినేషన్ కోసం టార్గెట్ చేయడం మరోసారి చర్చనీయంశమవుతోంది.
గణేష్ కూడా తనను నామినేట్ చేసిన సెలబ్రెటీలపై ఎలిమినేషన్ ప్రక్రియలో మండిపడ్డాడు. తన గొంతు నొక్కుతున్నారని.. మాట్లాడకు అంటూ అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సెలెబ్రెటీలన్న బెరకు గణేష్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అతడు వారితో కలవడం లేదు. దీన్ని సాకుగా చూపి గణేష్ ను ఇంటిలోంచి పంపించేయాలని చూడడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ సారి కూడా గణేష్ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ కు సామాన్యులు అంటే ఇష్టముండదన్న విమర్శ చుట్టుకోవడం ఖాయం. మరి బిగ్ బాస్ టీం ఈ కామన్ మ్యాన్ ను ఈసారి పంపిస్తారా లేదా అన్నది చూడాలి మరి.