సముద్ర దీవిలో అందాల దివి 

Update: 2023-01-18 17:30 GMT
బిగ్ బాస్‌తో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది దివి వాద్త్యా. అంతకుముందు ఒకటీ రెండూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినా అంతగా పేరు రాలేదు. బిగ్‌బాస్‌తో మాత్రం ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీసులు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా అకౌంట్లలో తన అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ అందాల భామ.

తాజాగా ఎరుపు రంగు చిన్న గౌనులో, పొడుగు సుందరి తన అందాలు ఆరబోసింది. ఈ బిగ్‌బాస్ బ్యూటీ అందాల విందు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

థాయిలాండ్ లోని కోహ్ హాంగ్ ఐలాండ్ వద్ద ఫోటోలకు ఫోజులిచ్చింది. అందాల దీవిలో తన అందాలతో దివి పాప మైమరిపించింది. ఎరుపు రంగు పొట్టి దుస్తుల్లో వావ్ అనిపించేలా కనిపిస్తోంది దివి.

2022 చివరి రోజు, నేను దీవుల్లో మరియు సముద్రంలో గడిపిన రోజు అంటూ ఫోటోలకు ట్యాగ్ ఇచ్చింది. కోహ్ హాంగ్ దీవుల్లో ఫుడ్ అద్భుతంగా ఉందని పేర్కొంది. మళ్లీ మళ్లీ రావాలనిపించే ఆతిథ్యం ఇచ్చిన రైలేఎకోటూర్ వారికి థ్యాంక్స్ అంటూ ఎండ్ చేసింది.

బిగ్ బాస్ 4 తర్వాత దివికి మంచి పేరు వచ్చింది. ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే దివికి అవకాశాలు వస్తున్నాయి. తనకు మంచి ఆఫర్ వస్తే, తనకు సినిమా కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ మధ్యే ప్రకటించింది దివి వాద్త్యా.

ప్రస్తుతం దివి కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఆ మధ్య దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దివి పర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. దివి అంటే హాట్ నెస్ అనే రీతిలో పిక్స్ పోస్టు చేస్తోంది ఈ భామ.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News