బాహుబలి రికార్డులే రికార్డులు .. 100కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి తెలుగు సినిమా. 600కోట్ల వసూళ్లతో దేశంలోనే టాప్ 3లో ఒకటిగా నిలిచిన సినిమా. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండాల్ వుడ్ .. ఏ పరిశ్రమలో అయినా అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక అనువాద చిత్రం. ఏ కోణంలో చూసినా రికార్డులే రికార్డులు. అయితే ఆ రికార్డులు అక్కడితో ఆగిపోలేదు. రిలీజ్ కి ముందే బాహుబలి 2కి క్రేజు పెంచడానికి ఈ విజయం ఎంతో ఉపయోగపడుతోంది. పైగా సీక్వెల్ ని జాతీయ స్థాయి ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు రాజమౌళికి తిరుగులేని అస్ర్తంలా ఉపయోగపడుతోంది.
బాహుబలి అమెరికా కలెక్షన్ల లో ఓవర్ ఫ్లోతో కొనసాగడం ప్రస్తుతం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాని బ్లూస్కై సినిమాస్ అమెరికాలో రిలీజ్ చేసింది. డిస్ర్టిబ్యూషన్ హక్కుల కోసం ఇన్నేళ్లలో లేనంతగా, టాప్ హీరోలకే పే చేయనంతగా పేచేసింది బ్లూస్కై. అమెరికా రిలీజ్ హక్కులు 9కోట్లు చెల్లించుకున్నారు. అప్పటికి ఇదే హయ్యస్ట్ పే. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత డాలర్ల వర్షం కురిపించింది. కేవలం యూఎస్ బాక్సాఫీస్ నుంచి 20కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ రూపంలో 40కోట్లు పైగానే వసూలు చేసింది.
అయితే ఈ సినిమా అమెరికా బాక్సాఫీస్ వద్ద సాధించిన అసాధారణ విజయం ఇప్పుడు చర్చకొచ్చింది. అక్కడ థియేటర్లలో ఓవర్ ఫ్లో కారణంగా వచ్చిన మొత్తాల్ని యూఎస్ డిస్ర్టిబ్యూటర్ 4 కోట్ల మేర తిరిగి నిర్మాతకే చెల్లించారట. తెలుగు సినిమా హిస్టరీలోనే ఇదో అసాధారణమైన ఫీట్.