హీరోయిన్‌ పరువు తీస్తున్న మాజీ మేనేజర్‌?

Update: 2018-12-08 01:30 GMT
బాలీవుడ్‌ హీరోయిన్‌ జరీన్‌ ఖాన్‌ తన మాజీ మేనేజర్‌ అంజలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువు తీసే విధంగా అంజలి ప్రవర్తిస్తుందని - తనను బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో పాటు - తనను అసభ్య పదజాలంతో దూషిస్తుందంటూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... హీరోయిన్‌ జరీన్‌ ఖాన్‌ కు చాలా కాలం పాటు మేనేజర్‌ గా చేసిన అంజలిని కొంత కాలం క్రితం తీసేయడం జరిగిందట. అంజలిని మేనేజర్‌ గా తీసేసిన తర్వాత కూడా జరీన్‌ ఖాన్‌ పేరు చెప్పుకుని కొందరి వద్ద డబ్బులు వసూళ్లు చేసిందట. తన పేరు వాడుతున్నట్లుగా జరీన్‌ ఖాన్‌ దృష్టికి రావడంతో షాక్‌ అయిన ఆమె వెంటనే అంజలిని మందలించేందుకు ప్రయత్నించగా రివర్స్‌ లో బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించిందట.

తన గురించి బయట తప్పుగా ప్రచారం చేయడంతో పాటు, తన పరువును తీస్తుందంటూ జరీనా ఖాన్‌ ఫిర్యాదులో పేర్కొంది. తనకు అంజలి పంపించిన అసభ్య మెసేజ్‌ లను పోలీసులకు జరీనా ఖాన్‌ ఇచ్చిందట. ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులు అంజలిని ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది.

సల్మాన్‌ మూవీ ‘వీర్‌’ చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయం అయిన జరీన్‌ ఖాన్‌ ఒక మోస్తరు సినిమాలతో పర్వాలేదు అన్నట్లుగా కెరీర్‌ నెట్టుకు వస్తుంది. ఇలాంటి సమయంలో మేనేజర్‌ చేసిన పనితో ఆమె తీవ్ర మనస్థాపంకు గురైనట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Tags:    

Similar News