పొగ తాగ‌ని ప‌డ‌తి దున్న‌పోతై పుట్టును!

Update: 2022-09-07 00:30 GMT
పొగ తాగ‌నివాడు దున్న‌పోతై పుట్టును! అన్నారు గిరీశం. ఆయ‌నే ఉండి ఉంటే ఫార్ములా మార్చేవాడు. పొగ తాగ‌ని ప‌డ‌తి దున్న‌పోతై పుట్టును! అనేసేవాడు. మందు తాగ‌ని వాడు పొగ తాగ‌ని వాడు అస‌లు మ‌గాడే కాదని భావించే స‌మాజం ఇది! కానీ ఇప్పుడు పొగ తాగ‌ని ప‌డ‌తి అస‌లు ఆడ‌దే కాద‌ని అనేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. పార్టీల్లో ఫుల్లుగా పెగ్గేసి స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ సిగ‌రెట్ వెలిగించే మ‌గువ‌ల  గురించి తెలుసుకుని అవాక్క‌యిన సంద‌ర్భాలెన్నో.

టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సిగ‌రెట్ వెలిగించ‌డంలో ఘ‌నాపాటీలు. తెలుగు వారికి భాగ్య‌ల‌క్ష్మిగా సుప‌రిచితురాలైన శ్రుతిహాస‌న్ సిగ‌రెట్ ద‌మ్ము కొట్ట‌డంలో స్పెష‌లిస్ట్. శ్రుతి సోద‌రి అక్ష‌ర కూడా ఇంత‌కుముందు సిగ‌రెట్ తాగుతూ క‌నిపించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ముంబై ప‌రిశ్ర‌మ‌లో సిగ‌రెట్ తాగ‌డం అన్న‌ది ష‌రామామూలు.

బాలీవుడ్ తారలు స్మోకింగ్ లేదా డ్రింకింగ్ వంటి మత్తుపదార్థాలను సేవిస్తూ తెరపై అలరించడాన్ని తరచుగా చూస్తుంటాం. ఇది ఆరోగ్యానికి హానికరం అని పొగాకు తయారీదారులు చట్టబద్ధమైన హెచ్చరికను జారీ చేస్తారు. మేల్ స్టార్స్ మాత్ర‌మే కాదు..కొందరు మహిళా నటులు నిజ జీవితంలోనూడా ధూమపానానికి అలవాటు పడ్డారు. అలా ధూమపానానికి బానిసలైన ఐదుగురు బాలీవుడ్ నటీమణుల్లో కంగనా రనౌత్- సుస్మితా సేన్- కొంక‌ణా సేన్- అమీషా ప‌టేల్- రాణి ముఖర్జీ  ఉన్నారు.

కంగనా రనౌత్

కంగనా రనౌత్ 19 సంవత్సరాల వయస్సులో చైన్ స్మోకర్ అన్న సంగ‌తిని ఇదివ‌ర‌కూ వెల్లడించింది. `వో లమ్హే` షూటింగ్ సమయంలో త‌ను స్మోకింగ్ కు అలవాటు పడింది. రోజుకు 10-12 సిగరెట్లు తాగేద‌ట‌. త‌ర్వాత అది కంటిన్యూ అయ్యింది.

కొంకణా సేన్ శర్మ

కొంకణా సేన్ శర్మకు తీవ్రమైన ధూమ‌పాన‌ వ్యసనం ఉండేది. ఆమె గర్భం దాల్చడం వల్ల ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడ‌లేదు. ప్ర‌స్తుతం స్మోకింగ్ పూర్తిగా మానేసింది.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా కూడా స్మోకింగ్ కి అలవాటు పడింది. ఆన్ స్క్రీన్  ఆఫ్ ద స్క్రీన్ కూడా ధూమపానం చేస్తుంది. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ధూమపానం చేస్తూ ఇంటర్నెట్ లో పట్టుబడింది. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

అమీషా పటేల్

`ప్యారడైజ్ స్ట్రీట్` మూవీలో వేశ్య పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమీషా పటేల్ ధూమపానం చేయడానికి ప్రయత్నించింది. తనకు స్మోకింగ్ అలవాటు లేదని చెప్పినా కానీ.. ఆమె చాలాసార్లు సిగ‌రెట్లు వెలిగిస్తూ పట్టుబడింది.

సుస్మితా సేన్

సుస్మితా సేన్ చాలాసార్లు పొగలు రింగురింగులుగా వ‌దులుతూ పబ్లిక్ గా కనిపించింది. తాను ఈ జీవనశైలిని ఎంచుకున్నానని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తానని చెప్పింది. ఇటీవ‌ల రోహ్మ‌న్ తో బ్రేక‌ప్ స‌మ‌యంలోనూ పొగ తాగ‌డాన్ని అనుస‌రించింది. ల‌లిత్ మోడీతో ప్రేమాయ‌ణంలో దీనికి బ్రేక్ ప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు.

రాణి ముఖర్జీ

రాణి ముఖర్జీ తనకు ధూమపానం విపరీతంగా అలవాటు ఉందని వెల్లడించింది. సిగరెట్ లేకుండా ఆమె రోజు ప్రారంభం కాదు. ధూమపానం జీర్ణక్రియకు సహాయపడుతుందని కూడా చెప్పింది. రాణీజీ ఇటీవ‌ల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News