ఉస్తాద్ రామ్ భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ 'ది వారియర్'. తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. రన్, పందెంకోడి వంటి బ్లాక్ బస్టర్ లని అందించిన డైరెక్టర్ కావడంతో తనతో సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే నమ్మకంతో రామ్ చేసిన ఈ మూవీ రియాలీటీకి వచ్చే సరికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే హీరో రామ్ కు, ఆయన అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది.
భారీ విజయాన్ని అందిస్తుందని భారీ అంచనాలు పెట్టుకుకున్న 'ది వారియర్' ఊహించని షాక్ ఇవ్వడంతో రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టాడు. 'ది వారియర్' ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు.
ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్ పైకి రానున్న ఈ మూవీ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను కండీషన్స్ పెడుతున్నారట.
తన సినిమాల్లో హీరోపై హెవీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించిన హీరోని ఫెరోషియస్ గా ప్రజెంట్ చేసే బోయపాట అందుకు తగ్గట్టుగా మేకోవర్ వుండాలని సినిమా ప్రారంభానికి ముందే కండీషన్స్ పెడుతుంటారు. తన సినిమాలో హీరో మరింత ఫిట్ నెస్ తో వుండాలని భావించే బోయపాటి శ్రీను ఈ మూవీ విషయంలోనూ హీరో రామ్ కు ఓ కండీషన్ పెట్టారట. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ ఈ మూవీ కోసం బరువు పెరగాలట.
దాదాపు 11 కేజీల వరకు బరువు పెరగాలని బోయపాటి సూచించారట. దీంతో ప్రస్తుతం రామ్ బరువు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీ కావడం.. ఎలాగైనా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలనే గట్టి నమ్మకంతో వుండటంతో హీరో రామ్..దర్శకుడు బోయపాటి చెప్పిన విధంగా బరువు పెరుగుతున్నాడట. అంతే కాకుండా సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం, మేకోవర్ విషయంలో రెండు పాత్రల్లో భిన్నంగా కనిపించాలనే ఆలోచన వల్లే రామ్ బరువు పెరుగుతున్నారట.
బోయపాటి శ్రీను 'అఖండ'తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మంచి ఫామ్ లోకి వచ్చారు. అదే ఫామ్ తో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా మలచడం ఖాయమని రామ్ బలంగా నమ్ముతున్నారట. ఆ కారణంగానే బోయపాటి కండీషన్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ తనకు ఎలా కాలంటే అలా రెడీ కావడానికి రామ్ ఏ విషయంలోనూ అడ్డు చెప్పడం లేదని చెబుతున్నారు. ఇదిలా వుంటే బోయపాటి శ్రీను కూడా ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ ని అందించి తాను కూడా రేసులో వున్నాననే సంకేతాల్ని అందించాలనే పట్టుదలతో వున్నాడని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.