తెరపైకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. సుమారు 40కోట్ల వ్యయంతో తెరకెక్కిన అల్లుడు శీనుతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫలితం నిరాశపరిచింది. అయితే శీను మాత్రం హీరోగా పాస్ అయ్యాడు. మాస్ కథలకు తగ్గ మరో కథానాయకుడు వచ్చాడనపించుకొన్నాడు. దీంతో స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను లైన్లోకి వచ్చి బెల్లంకొండతో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. ఆ కాంబినేషన్ లో సినిమా మొదలైంది కూడా. కారణాలేంటో తెలియదు కానీ... ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది. బోయపాటి వెంటనే అల్లు అర్జున్ తో `సరైనోడు`ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. దీంతో బోయపాటి, బెల్లంకొండల శ్రీనుల సినిమా అటకెక్కినట్టే అని ప్రచారం సాగింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఆసినిమా ఆగిపోలేదంటున్నాడు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా స్పీడున్నోడు అనే సినిమా తెరకెక్కుతోంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతోనే సినిమా ఉంటుందని బెల్లంకొండ స్పష్టం చేశాడు. బోయపాటి `సరైనోడు` సినిమా కూడా చివరి దశకు చేరుకొన్నట్టు తెలుస్తోంది. సో.. ఇద్దరూ ఒకేసారి సినిమాల్ని పూర్తి చేస్తారు కాబట్టి ఇద్దరూ కలిసే కొత్త సినిమా మొదలుపెడతారన్నమాట. చాలామంది బెల్లంకొండతో తీయాలనుకొన్న కథనే బోయపాటి ఇప్పుడు బన్నీతో తీస్తున్నాడని అనుకొన్నారు. కానీ బెల్లంకొండ మాత్రం బోయపాటిగారి దగ్గర నా కథ అలాగే ఉందనీ, ఆ కథతోనే సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.