ప్రపంచంలోనే ఏ ఇతర కమెడియన్ అందుకోలేని అరుదైన రికార్డులు అందుకున్న బ్రహ్మానందం ఎందుకని రేసులో వెనకబడ్డారు? గిన్నిస్ రికార్డ్ హోల్డర్ గా సంచలనాలు సృష్టించిన బ్రహ్మానందానికి అసలేమైంది? ఎందుకని సినిమాలకు దూరంగా ఉంటున్నారు? ఇటీవల అభిమానుల్ని తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి. ఆ మాయదారి న్యూస్ చానెల్ చేసిన దుష్ప్రచారం బ్రహ్మీని నిజంగానే దెబ్బ కొట్టిందా? ఆయన క్రమశిక్షణా రాహిత్యం అంటూ చేసిన ప్రచారాన్ని నమ్మి ఎవరూ అవకాశాలివ్వడం లేదా? అంటే.. ఇలాంటి సందేహాలకు సరైన క్లారిటీ లేదు.
అయితే బ్రహ్మీనే ఇవే ప్రశ్నలు అడిగితే ఆయనేమంటారంటే.. అసలు తన స్థాయికి తగ్గ పాత్రలు ఎక్కడున్నాయి? ప్రతిసారీ అవే పాత్రల్ని రిపీటెడ్ గా రాసుకుని దర్శకరచయితలు తనని కలుస్తుంటే అవి చేయలేక కాదన్నవి ఎన్నో ఉన్నాయని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పటికీ అవే రొటీన్ పాత్రల్లో చేయలేనని ఖరాకండిగానూ చెప్పారు. అయితే ఆయనను మెప్పించే పాత్ర ఇంతకాలానికి వెతుక్కుంటూ వచ్చిందా? అంటే .. అవుననే తాజా సన్నివేశం చెబుతోంది.
సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ బ్రహ్మీకి ఓ అదిరిపోయే క్యారెక్టర్ ని ఆఫర్ చేశారు. ఈసారి ఆయన కూడా కొత్తదనం నిండిన కథనే ఎంచుకుని ప్రయత్నం చేస్తుండడంతో ఈ ఆఫర్ కి బ్రహ్మీ ఓకే చెప్పారట. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రాజ మార్తాండ చిత్రంలో బ్రహ్మానందం ఎంతో ఎమోషన్ పండించే పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇది కామెడీ రోల్ కాదు. రొటీన్ గా అసలే ఉండదు. జీవితంలో ఎంతో చూసిన ఒక అనుభవజ్ఞుడిలా అతడు తెరపై కనిపించబోతున్నారని తాజాగా రివీలైన బ్రహ్మీ లుక్ చెబుతోంది. నెరిసిన తలకట్టు.. పండిన గడ్డం.. పెద్ద కళ్ల జోడు.. ఈ గెటప్ చూస్తుంటే కొంత వరకూ ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ ని జ్ఞప్తికి తెస్తోంది. ఇక ఆ స్థాయి అనుభవాలు ఘడించిన ఓ సీనియర్ సిటిజన్ పాత్రలోనే బ్రహ్మీ నటించబోతున్నారని అర్థమవుతోంది. అలా ఆ గడ్డంపై చేతిని ఆన్చి దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారో కానీ.. ఈసారి కంటతడి పట్టించే ఎమోషన్ ఖాయమేనని ఫ్యాన్స్ కు అర్థమవుతోంది.
ప్రస్తుతం బ్రహ్మీ కొత్త గెటప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక తనని కేవలం హాస్య నటుడు అంటే కుదరదు. వాస్తవానికి తనని అలా పిలిచినా బ్రహ్మానందంకి నచ్చదు. తనని మంచి నటుడు అంటేనే సహిస్తారు. ఈసారి తనకు నచ్చిన అవకాశం వచ్చింది కాబట్టి తనని మునుపటి కంటే చాలా కొత్తగా అభిమానులు చూస్తారన్నమాట. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్న ఈ సినిమా మరాఠా బ్లాక్ బస్టర్ నట సామ్రాట్ కి రీమేక్. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.