పాన్ ఇండియా చిత్రం `లైగర్` రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రిలీజ్ కి ఇంకా ఐదు రోజులే సమయం ఉంది. దీంతో యూనిట్ ప్రచారాన్ని మరింత పీక్స్ తీసుకెళ్తుంది. కొన్ని రోజుల పాటు ఉత్తరాది రాష్ర్టాల్ని చుట్టేసిన టీమ్ ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో ప్రచారం చేస్తోంది. స్పెషల్ ఇంటర్వ్యూలు..చిట్ చాట్ లతో అన్ని మీడియా సంస్థల్ని చుట్టేస్తున్నారు.
తాజాగా యూనిట్ విజయవాడలో ప్రచారం నిర్వహిస్తుంది. విజయ్ దేవరకొండ..పూరి జగన్నాద్..ఛార్మీ..అనన్య పాండే విజయవాడ గల్లీ గల్లీల్ని చుట్టేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి. విజయ్ మాట్లాడుతూ `లైగర్ కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డాం. ప్రాణం పెట్టి సినిమా పూర్తిచేసాం.
సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. పూరి కథ చెప్పగానే మెంటలొచ్చింది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఒకే చెప్పేసా. నటిస్తున్నప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యా. మనం ధర్మంతో ఉన్నాం. ఏదొచ్చినా కొట్లాడుడే. కరోనా సమయంలో చాలా మంది మధ్య తరగతి ప్రజలకు సహాయం చేసాం. వాళ్లిచ్చిన డబ్బుతోనే సేవ చేసా.
తల్లి సెంటిమెంట్ తో ఇండియా ప్లాగ్ ఎగరవేస్తే మీరు బాయ్ కట్ చేస్తారా? నేటి నుంచి ఏపీ తెలంగాణలో టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి చూసుకుందాం? అంటూ బోయ్ కట్ చేసిన వాళ్లకి విజయ్ సవాల్`` విసిరాడు. ఇప్పటికే లైగర్ సినిమా ఇబ్బందుల్లో పడిందని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. సినిమాని బోయ్ కట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది అమీర్ ఖాన్ కి లాల్ సింగ్ చడ్డా తో తెలిసొచ్చింది.
అమీర్ సినిమాని బోయ్ కట్ చేసిన విధానం గురించి విజయ్ స్పందించి ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తొలిరోజు 50 కోట్లు వసూళ్లు సాధించాల్సిన సినిమా 12 కోట్లు తెచ్చింది. కేవలం సినిమాని బోయ్ కట్ చేయడం వల్లే. ఇప్పుడు విజయ్ వాళ్లకే సవాల్ విసిరాడు .దీంతో `లైగర్` టీమ్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది.
మీడియా సమావేశంలో పాత్రికేయుల ముందు విజయ్ తను ముందున్న టేబుల్ పై కాళ్లు పెట్టి మాట్లాడటం వంటి సన్నివేశాలు అతనిపై నెగిటివిటీని స్ర్పెడ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు తెరపైకి వచ్చాయి. అయితే విజయ్ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా మందుకు సాగిపోతున్నాడు.