శ్రీమంతుడు రిలీజై 150కోట్లు వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కిక్ 2 రిలీజై అట్టర్ ఫ్లాప్ అన్న టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్ లు, పబ్లిసిటీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే అలాంటి ప్రచారంలో కొన్ని తప్పుల తడకలు కూడా ఉన్నాయి. ఈ సినిమాల పోస్టర్ లు, ట్రైలర్ లు, ఇతరత్రా పబ్లిసిటీ మెటీరియల్ పై అసలు సెన్సార్ రిపోర్ట్ అన్నదే ముద్రించలేదని ఆర్ టిఎ యాక్టివిస్ట్ రాజీవ్ ఖన్నా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 38 ప్రకారం ఇది నేరం. ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా ప్రాచరంలో సెన్సార్ రిపోర్ట్ ఏమిటి? అన్నది మెన్షన్ చేయాలి. కానీ అదేమీ లేకుండానే ఈ సినిమాలకు ప్రచారం చేసేసుకుంటున్నారు నిర్మాతలు. కేసు ప్రస్తుతం మియాపూర్ కో్ర్టుకి బదలాయింపు అయ్యింది. త్వరలోనే విచారణకు రానుంది. ఇంతకాలం బోలెడన్ని యాక్ట్ ల గురించి విన్నాం. రచయితల క్రియేటివిటీని కొట్టేయకుండా కాపీ రైట్ యాక్ట్ ఉంది. సంగీతం కూడా కాపీ కొట్టేయకుండా ఓ యాక్ట్ ఉంది. సినిమాటోగ్రఫీకి సంబంధించిన యాక్టు కూడా ఉందని ఇప్పటికి తెలిసొచ్చింది. ఇలాంటి హిడెన్ యాక్ట్స్ ఇంకెన్ని ఉన్నాయో? ఏదైనా అన్నీ మన మంచికే.