ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సినిమాలు చూసే తీరిక ఉంటుందని అనుకోలేం. కానీ ఆయన తన తమ్ముడి కొడుకు నారా రోహిత్ సినిమాలన్నింటినీ దాదాపుగా చూస్తారట. ఈ విషయాన్ని రోహితే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. తన సినిమాల్లో ఒకదాన్ని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చూసినట్లు కూడా రోహిత్ వెల్లడించడం విశేషం. ఆ సినిమా ఏదో.. తన సినిమాలపై తన పెదనాన్న ఎలా ఆసక్తి చూపిస్తారో రోహిత్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘మా పెదనాన్న దాదాపుగా నా ప్రతి సినిమా చూస్తారు. నేను నటించిన వాటిలో ‘జ్యో అచ్యుతానంద’ ఆయనకు బాగా నచ్చింది. ఆ సినిమాను రెండుసార్లు చూశారట. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా కావడం.. ఆయనకు కూడా ఒక తమ్ముడు ఉండటంతో ఆ సినిమా బాగా కనెక్టయినట్లుంది. ఆయన్ని కలిసినపుడు సినిమాల గురించి అప్పుడప్పడు చర్చిస్తుంటాం’’ అని అని రోహిత్ తెలిపాడు.
తాను బరువు తగ్గడంలో తన పెదనాన్న పాత్ర కూడా ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. ‘‘నేను బరువు ఎక్కువయ్యానని నాకే అర్థమైంది. నేను బరువు తగ్గితే బాగుంటుందని వెబ్ సైట్లలో కూడా వార్తలు రాశారు. ‘బాలకృష్ణుడు’ దర్శకుడు కూడా బరువు తగ్గాలని అడిగాడు. అదే సమయంలో పెదనాన్నను కలిసినపుడు ‘బాగా లావయ్యావు. కాస్త తగ్గితే బాగుంటుంది’ అన్నారు. ఆయనకు ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ ఉంటుంది. ఆయన చెప్పేసరికి ఇక మనం తగ్గాల్సిందే అని గట్టిగా అనుకుని 21 కిలోల బరువు తగ్గాను’’ అని రోహిత్ వెల్లడించాడు.