కొన్ని రోజులు సుచిలీక్స్ విపరీతంగా పాపులర్ అయిపోతున్నాయి. సింగర్ సుచిత్రా కార్తీక్ సోషల్ మీడియా అకౌంట్ లో జరుగుతున్న హంగామా కారణంగా.. చాలామంది సెలబ్రిటీల పరిస్థితి బైట చెప్పుకోలేని విధంగా మారిపోతోంది. ప్రైవేటు ఫోటోలు బయటపెడతానంటూ ఆ ఖాతా ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఇదంతా సుచిత్ర చేస్తోందో.. లేకపోతే ఆమె భర్త కార్తీక్ చెబుతున్నట్లుగా అకౌంట్ హ్యాకింగ్ కు గురవుతోందో అర్ధం కాని పజిల్ లా మారిపోయింది. అయితే.. వ్యవహారం కారణంగా.. చిన్మయి తీవ్ర ఆవేదనకు గురయిందని చెబుతున్నాడు ఆమె భర్త రాహుల్ రవీంద్రన్. చిన్మయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బైట పెడతామన్నపుడు అసలు స్పందించకూడదని భావించారట. కొంతసేపు స్థిరంగానే ఉన్న చిన్మయి.. ఆ తర్వాత మనోవేదనతో ఆపకుండా వెక్కి వెక్కి ఏడ్చిందన్నాడు ఆమె భర్త. ఈ ప్రచారాన్ని జనాలు నమ్మేసి.. తనను తప్పుగా అర్ధం చేసుకుంటారని.. ఇంతకాలం కష్టపడి సాధించిన పేరు పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని భయపడిందట చిన్మయి.
"అలాంటి ఫోటోలు వీడియోలు ఏమీలేవని మాకు తెలుసు. అయితే.. జనాలు అదంతా నిజమే అని నమ్ముతున్నారు. ఇప్పటికి 40 వేలకు పైగా హేట్ మెసేజ్ లు వచ్చాయి. ఇలాంటప్పుడు ఎవరికీ సమాధానం చెప్పలేదం. అయినా.. ఇలాంటపుడు మానసికంగా దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటే ఎవరితి బాధ్యత" అని నిలదీస్తున్నాడు రాహుల్ రవీంద్రన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/