లాక్ డౌన్ కారణంతో సాధారణ ప్రజలతో పాటుగా సెలబ్రిటీలు కూడా తమ ఇళ్ళలోనే ఉన్నారు. పని లేకపోవడంతో ఇంటి పనులు చేస్తున్నామని.. 'బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్' కూడా మొదలు పెట్టి అన్నీ పనులు చేస్తూ.. తోటి సెలబ్రిటీలను పని చేయాలని ఛాలెంజ్ విసురుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో జాయిన్ అయ్యారు. కొంతవరకూ ఇది బాగానే ఉంది కానీ చిరు సోషల్ మీడియాలో మరీ యాక్టివ్ గా మారడం కొందరు అభిమానులకు మింగుడుపడడం లేదు.
ఏదో ఒక అప్డేట్ అంటే సరే కానీ అదే పనిగా చిరు అప్డేట్లు ఇస్తూ ఉండడం.. ప్రతిదాన్ని వీడియో తీసి పెట్టడం పట్ల సీనియర్ మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు.. ట్రోల్స్ సహజం. ఎవరూ వాటి బారి నుంచి తప్పించుకోలేరు. చిరంజీవికి కూడా ఈ నెగెటివ్ కామెంట్లు తప్పడం లేదు. చిరు పెడుతున్న పోస్టులకు కొందరు యాంటి ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్లు పెట్టడం అభిమానుల మనసును నొప్పిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఇది తప్పదు కాబట్టి ఫాన్స్ తమలో తాము ఇబ్బంది పడుతున్నారట. చిరు సోషల్ మీడియాలో అనవసరమైన అప్డేట్లు ఇవ్వడం.. ప్రతి ఒక్క కామెంటుకు రెస్పాన్స్ ఇవ్వడం మానెయ్యాలని.. కాస్త స్పీడ్ తగ్గించుకోవాలని కోరుతున్నారు.
మరో విషయం ఏంటంటే అసలే కరోనా..లాక్ డౌన్ అంటూ జనాలు ఇబ్బందులు పడుతుంటే మెగాస్టార్ కు ఈ వయసులో కొత్తగా ఈ సోషల్ మీడియా మోజు ఏంటోనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియా మొదట్లో కొత్తలో వాడేవారికి అలాగే ఉంటుందని.. పొరపాటున ఒకసారి స్లిప్ అయి ఏదో కామెంట్ పెట్టినా.. లేదా లేనిపోని అంశాలపై అభిప్రాయం చెప్పినా.. చిరు అనవసరంగా ఎదో ఒక వివాదంలో ఇరుక్కునే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. చిరు ఈమధ్య పెట్టే వీడియోలలో ఫిట్నెస్ తగ్గినట్టుగా అనిపిస్తోందని.. సోషల్ మీడియా విషయంలో కాస్త శాంతించి.. తన ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తే బెటరని వారి అభిప్రాయం. మరి బాసు ఈ మాటలు వింటారో లేదా సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తూనే ఉంటా అంటారో!