కమర్షియల్‌ హీరో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ

Update: 2022-10-03 23:30 GMT
గోపీచంద్‌ చాలా అంచనాలు పెట్టుకుని నటించిన పక్కా కమర్షియల్‌ మూవీ ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన విషయం తెల్సిందే. మారుతిపై గోపీచంద్‌ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది.

పక్కా కమర్షియల్‌ తో తన యొక్క వరుస ఫ్లాప్స్ కి బ్రేక్‌ పడుతుందని భావించిన గోపీచంద్‌ కి నిరాశే మిగిలింది. మారుతి కూడా తనకు హిట్‌ ఇవ్వలేక పోయాడు. అయినా కూడా హీరో గోపీచంద్‌ నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పక్కా కమర్షియల్‌ తో నిరాశ పర్చిన గోపీచంద్‌ ఈసారి యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది.

ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను దర్శకుడు వైట్ల తెరకెక్కిస్తున్నాడట.

శ్రీను వైట్లకు ఈ సమయంలో సక్సెస్‌ ఎంత అవసరమో గోపీచంద్‌ కి కూడా అంతే అవసరం. ఇద్దరు కూడా కసి మీద ఉండి ఉంటారు. కనుక ఒక మంచి సినిమా వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వైట్ల దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక మునుపటి ఫామ్‌ కు ఈ దర్శకుడు వస్తాడా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News