గత ఏడాది కరోనాకు చికిత్స పొంది కోలుకున్న నటుడు నిర్మాత బండ్ల గణేష్ రెండోసారి కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో ఐసియులో చేరారని తెలిసింది. గణేష్ కోవిడ్ -19 పాజిటివ్ అని నేటి ఉదయమే వార్తలు వచ్చాయి. ఇటీవల వకీల్ సాబ్ ఈవెంట్ కి వెళ్లి వచ్చాక అతడికి జ్వరం వచ్చింది. కానీ కరోనా కాదని లైట్ తీస్కున్నారు. ఇప్పటికీ అతను జ్వరం ఒళ్లునొప్పులు వంటి ఇతర లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అనంతరం అపోలోలో చేరారు.
ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. నిపుణుల బృందం అతన్ని నిరంతరం గమనిస్తోంది. అతనికి ద్రవాలు ఇస్తున్నారని సన్నిహిత వర్గాల ద్వారా వెల్లడైంది. 2020లో కరోనా ప్రారంభంలోనూ బండ్ల గణేష్ కరోనా భారిన పడినా చికిత్సతో కోలుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం హైదరాబాద్ లో తీవ్రంగా ఉంది. ఈ సమయంలో ఇది మరింత తీవ్రంగా మారింది. గణేష్ కుటుంబం అతడు త్వరగా కోలుకోవాలని ఆందోళన చెందుతున్నారని తెలిసింది.
బండ్ల గణేష్ తో కాంటాక్ట్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్నారు. నిర్మాతలు దిల్ రాజు.. అల్లు అరవింద్ కోవిడ్ కి చికిత్స పొందుతున్న సంగతి తెలిసినదే.