ఓ గజదొంగ ఆత్మకథలో రానా??

Update: 2017-12-18 16:47 GMT
ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు వినూత్నంగా ఉండే సినిమాలను చేస్తున్నారు. కొంతమంది నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ ను చేయడానికి కూడా పెద్దగా వెనకాడట్లేదు. అయితే ఇప్పుడు రానా దగ్గుబాటి మాత్రం.. వరుసగా ఘాజీ.. నేనే రాజు నేనే మంత్రి.. 1918.. మొదలగు సినిమాలతో వినూత్నమైన విభిమిన్నమైన కథలను ఎంచుకుంటూ పోతున్నాడు. అయితే ఇప్పుడు ఒక గజదొంగగా మారనున్నాడా?

త్వరలోనే స్టూవర్టుపురంకు చెందిన భయంకరమైన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఆత్మకథతో నిర్మాత అనిల్ సుంకర్ ఒక సినిమా తీయాలని రెడీ అయ్యారట. ఈ సినిమా కోసం ఆల్రెడీ కథను వండించేసి.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త డైరక్టర్ వంశీ కృష్ణ కూడా రెడీగా ఉన్నట్లు టాక్. అయితే ఇందులో ఒక స్టార్ హీరో అయితేనే బాగుంటుందని తలంచి.. రానా దగ్గుబాటి కోసం వెయిట్ చేస్తున్నారట. ఆల్రెడీ కథ వినేసిన రానా.. ఇంకా సినిమా గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట.

స్టూవర్టుపురం కు చెందిన టైగర్ నాగేశ్వరరావు.. బ్రిటీష్‌ వారు క్రిమినల్ ట్రైబ్ గా ముద్రవేసి యరుకుల తెగకు చెందినవాడు. అతను పలు నగరాల్లో ఇళ్ళూ బ్యాంకుల అలాగే ట్రైన్లలో దొంగతనం చేస్తూ జీవనం సాగించి.. పలుమార్లు పోలీసులకు దొరికి కూడా తప్పించుకున్నాడు. చివరకు 1987లో టైగర్ ను పోలీసులకు కాల్చి చంపేశారు. ఈ కథలో మరి రానా చేస్తాడో లేడో చూడాల్సిందే.
Tags:    

Similar News