మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో దంగల్ బ్యూటీ సనాషేక్ ఎఫైర్! అంటూ చాలా కాలంగా కథనాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమీర్ ఖాన్ తన సహచరి కిరణ్ రావుకు విడాకులు ఇవ్వడానికి కారణం దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ అంటూ ప్రచారమైంది.
అదంతా అటుంచితే ఇటీవలి కాలంలో ఫాతిమా కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. తన కెరీర్ విషయంలో ఫాతిమా కొంత ఫ్రస్టేటెడ్ గానే ఉంది. అయితే ఎట్టకేలకు తనకు ఓ అద్భుతమైన ఆఫర్ దక్కింది. అది కూడా ప్రముఖ దర్శకులు మేఘనా గుల్జార్ తెరకెక్కించే భారీ చిత్రంలో అవకాశం కావడం విశేషం. కత్రిన ప్రియుడు విక్కీ కౌశల్ తో కలిసి `సామ్ బహదూర్`లో ఫాతిమ నటిస్తోంది. 2017 లో చిత్రనిర్మాతలు మేఘనా గుల్జార్ - రోనీ స్క్రూవాలా ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా జీవితంపై సినిమా చేసే ఆలోచన ఉందని ప్రకటించారు. దాపు రెండు సంవత్సరాల తరువాత విక్కీ కౌశల్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తారని వెల్లడైంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో సినిమాకి టైటిల్ కూడా వచ్చింది.
``ఆత్యుతమ వ్యక్తి.. ధైర్యవంతుడుమా సామ్ బహదూర్. ఫీల్డ్ మార్షల్ #సామ్ మానెక్షా జన్మదినం సందర్భంగా #సామ్ బహదూర్ కథతో సినిమా చేస్తున్నాం `` అని విక్కీ ఇన్ స్టాగ్రామ్ లో రాశాడు. తాజాగా మేఘనా గుల్జార్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్ నటిస్తుందని వెల్లడైంది. సామ్ బహదూర్ లో కీలక పాత్ర పోషించడానికి మేకర్స్ ఫాతిమాను సంప్రదించారు. ఇక సోషల్ మీడియాల్లో ఫాతిమ వరుస ఫోటోషూట్లు ఇటీవల వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఫాతిమ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ చాలా స్పెషల్ గా ఆకర్షణీయగా కనిపిస్తోంది. ఇది యువతరంలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సామ్ బహదూర్ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
సామ్ మనేక్షాగా విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. అతడి ఫస్ట్ లుక్ 2019 లో ఆవిష్కరించారు. "ది స్వాష్ బకింగ్ జనరల్ & ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా- SAM మనేక్ షా. అతని ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించే అవకాశం లభించినందుకు గర్వంగా భావిస్తున్నాను. అతని మరణ వార్షికోత్సవం సందర్భంగా అతనిని గుర్తు చేసుకుంటూ & మేఘన-రోనీతో కొత్త ప్రారంభమిదని భావిస్తున్నాను.. అని అన్నారు. నిర్మాత స్క్రూవాలాతో విక్కీ కౌశల్ మూవీ `ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ` ప్రస్తుతానికి నిలిపివేయబడింది. ఇందులో కియరా అద్వానీ - భూమి పెడ్నేకర్ తదితరులు నటిస్తున్నారు.