KGF 2 సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న అసాధారణ వసూళ్లతో టాప్ 10లో నంబర్ 2 పొజిషన్ ని కైవశం చేసుకుంది. ఇప్పటివరకూ రెండో స్థానంలో నిలిచిన అమీర్ ఖాన్ -దంగల్ రికార్డును ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆర్.ఆర్.ఆర్ రికార్డును అధిగమించింది. ఇప్పుడు బాహుబలి 2 (BB2) రికార్డ్ మాత్రమే పెండింగ్.
KGF చాప్టర్ 2 భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రంగా నిలిచింది. ఆ మేరకు హిందీ మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ ఈద్ (మంగళవారం) రోజున సినీ ప్రేక్షకులకు ఈ చిత్రం మొదటి ఎంపికగా మారింది. బుధవారం కూడా కలెక్షన్లు బలంగానే ఉన్నాయి. ఈ వారంతం వరకూ తగ్గేదేలే అంటూ వసూళ్ల హవా సాగించడం ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం నాటి కలెక్షన్లతో కేజీఎఫ్ చాప్టర్ 2 అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ `దంగల్` జీవితకాల వసూళ్ల రికార్డును బ్రేక్ చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ పాన్ ఇండియా చిత్రంగా నిలిచింది.
ఆసక్తికరంగా రెండు దక్షిణ భారత సినిమాలు బాలీవుడ్ రికార్డుల్ని సవరిస్తూ.. వాటి డబ్బింగ్ వెర్షన్ లతో బాలీవుడ్ లో మొదటి .. రెండవ స్థానాలను సాధించడం ఒక సంచలనం. కేజీఎఫ్ 2 ఇప్పటికే నైజాంలో ఆల్ టైమ్ గ్రాసర్ జాబితాలో చేరగా .. ఓవర్సీస్ నుంచి అసాధారణ వసూళ్లను దక్కించుకుంది. ఏపీలో ఇరుగు పొరుగు భాషల్లోనూ చక్కని వసూళ్లను సాధించింది. అయితే బాహుబలి 2 రికార్డుల్ని సవరించాలంటే అంత సులువేమీ కాదనేది ఒక విశ్లేషణ. కేజీఎఫ్ 2 రోజుకు 8 కోట్లు సుమారుగా వసూలు చేస్తోంది హిందీ బెల్ట్ లో. ఇలానే కొనసాగితే మరో 15రోజుల్లో రికార్డ్ బ్రేక్ చేసే వీలుంది. కానీ ఇంతలోనే పలు భారీ హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలు విడుదలకు వస్తున్నాయి.. మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంటుంది.
భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాల జాబితాను పరిశీలిస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన `కేజీఎఫ్ 2` గతంలో ఎన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇది చివరకు అమీర్ ఖాన్ `దంగల్` సహా SS రాజమౌళి RRR కలెక్షన్ లను అధిగమించింది. అయితే `బాహుబలి: ది కన్‌క్లూజన్` భారీ వసూళ్లతో అజేయంగా నిలిచింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలను పరిశీలిస్తే..
బాహుబలి 2
SS రాజమౌళి తెరకెక్కించిన అసాధారణ పాన్ ఇండియా చిత్రం బాహుబలి: ది కన్ క్లూజన్ భారతదేశంలో రూ. 1346.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ల తో అగ్రస్థానంలో ఉంది.
KGF 2
రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF 2 విడుదలైన 20 రోజుల్లోనే దాదాపు 892 కోట్ల రూపాయలను రాబట్టి అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
RRR
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా SS రాజమౌళి తెరకెక్కించిన RRR కేవలం 40 రోజుల్లో సుమారుగా 887 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
దంగల్
అమీర్ ఖాన్ రెజ్లింగ్ డ్రామా దంగల్ భారతదేశంలో రూ. 511.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ తో 4వ స్థానంలో నిలిచింది.
2.0
రజనీకాంత్- అక్షయ్ కుమార్ నటించిన 2.0 రూ.508.50 కోట్ల కలెక్షన్లతో 5వ స్థానంలో నిలిచింది.
బాహుబలి: ది బిగినింగ్
ప్రభాస్- రానా దగ్గుబాటి తదితరులు నటించిన ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి: ది బిగినింగ్ రూ. 482 కోట్ల కలెక్షన్లతో జాబితాలో 6వ స్థానంలో నిలిచింది.
PK
అమీర్ ఖాన్ మరో బ్లాక్ బస్టర్ పీకే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. 455 కోట్ల కలెక్షన్లతో 7వ స్థానంలో నిలిచింది.
ఎవెంజర్స్: ఎండ్‌గేమ్
ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ హాలీవుడ్ నుంచి భారతదేశంలో టాప్ 10లో ప్రవేశించిన ఏకైక చిత్రం. ఇది భారతదేశంలోనే రూ. 442.70 కోట్ల కలెక్షన్ లతో 8వ స్థానంలో నిలిచింది.
400 కోట్లు పైబడిన వసూళ్లతో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై.. రణబీర్ కపూర్ నటించిన సంజు చిత్రాలు 9 వ స్థానం ..10వ స్థానం దక్కించుకున్నాయి. జాబితాలో టాప్ 10 లో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు అమీర్ ఖాన్ నటించిన రెండు సినిమాలు ఉన్నాయి.