మెగా హీరోల మధ్యలో దీపిక

Update: 2018-01-05 23:30 GMT
భారీ బడ్జెట్ తో నిర్మించే కొన్ని సినిమాల దురదృష్టం ఏమిటో గాని రిలీజ్ అయ్యే సమయానికే ఊహించని విధంగా ఎదో ఒక వివాదం చెలరేగుతుంటుంది. అదే తరహాలో గత ఏడాది మొత్తం రసభసగా అన్నట్లు సాగినా పద్మావతి వివాదానికి 2018లో తెర పడింది. ఫైనల్ సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాల మేరకు సన్నివేశాలను తొలగించమనడంతో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి వివాదస్పదంగా అనిపినించిన సన్నివేశాలను తొలగించాడట.

ఇక మొత్తంగా సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంతో ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అయితే వివాదాలు జరగడం వల్ల సినిమాకు ఉహలకందని ప్రమోషన్స్ జరిగింది. ఒక్క నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా సినిమా గురించి వార్తలు బాగానే వచ్చాయి. దీంతో సినిమా సౌత్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా వల్ల ఇద్దరు హీరోలు కొంచెం టెన్షన్ పడుతున్నారు. వారెవరో కాదు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్.

ఇంటిలిజెంట్ - తొలి ప్రేమ సినిమాలతో ఫిబ్రవరి 9న రావాలని మెగా హీరోలు డేర్ ప్లానింగ్ చేసుకున్నారు. కానీ పద్మావతి ఇప్పుడు వీరికి షాక్ ఇచ్చింది. ఆ సినిమాపై అంచనాలు ఇప్పుడు మాములుగా లేవు ఏ సినిమా వచ్చినా పద్మావతి ఓపెంనింగ్స్ బ్రేక్ చేయలేవని టాక్ వినిపిస్తోంది. ఇక ఏ మాత్రం సినిమా బావుందని టాక్ వచ్చినా ఇంకా హై రేంజ్ కు వెళుతుంది. మరి ఇలాంటి సినిమా ముందు మెగా హీరోలు రిస్క్ చేస్తారో లేదో చూడాలి!


Tags:    

Similar News