సల్మాన్ -కత్రిన బ్రేకప్, షాహిద్ కపూర్-కరీనా కపూర్ బ్రేకప్, రణబీర్ సింగ్-దీపిక బ్రేకప్, బిపాసా-జాన్ అబ్రహాం బ్రేకప్, త్రిషా-రానా బ్రేకప్.... ఇలా బ్రేకప్ జాబితా తిరగేస్తే చాంతాడంత కనిపించేట్టే ఉంది. బాలీవుడ్ లో కలిసి మెలిసి తిరిగేయడం, నచ్చినట్టు జీవించడం, అటుపై నచ్చకపోతే విడిపోవడం ఇవన్నీ చాలా కామన్ ఎలిమెంట్స్ అయిపోయాయి. కుర్ర హీరోలు మినిమం నలుగురైదుగురు హీరోయిన్ల తో ఎఫైర్ నడిపించనిదే సంతృప్తి చెందడం లేదు. చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్, లవర్ బోయ్ షాహిద్ కపూర్ ఇలాంటి విషయాల్లో చాలా స్పీడ్. అయితే ఇప్పుడు అదే బాటలోకి రణవీర్ సింగ్ వచ్చి చేరాడు. ఇతగాడు వరుసగా తన కథానాయికలతో లవ్వాయణాలు వెలగబెడుతూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాడు.
ఇప్పటికే అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలతో లవ్ స్టోరీస్ నడిపించిన రణవీర్ ప్రస్తుతం ఆ ఇద్దరితో బ్రేకప్ చెప్పేసి దీపిక పదుకొన్ తో లవ్వాయణం నడిపిస్తున్నాడు. రామ్ లీల సినిమా నుంచి ఇద్దరి మధ్యా కెమిస్ర్టీ వర్కవుటైంది. ఆ తర్వాత వరుసగా కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో భాజీరావ్ మస్తానీ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. దీపిక రణవీర్ కి భార్య పాత్రలో నటిస్తోంది. అయితే ఇదే హుషారులో డిప్స్ ని రియల్ వైఫ్ గా చేసుకోవాలని రణవీర్ భావిస్తున్నాడుట. ఇప్పటికే దీపిక ముందు ప్రపోజల్ పెట్టాడు. అయితే ఇక్కడే సీను రివర్సయ్యి, అనుకున్న దొక్కటి అయినదొక్కటి అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. రణవీర్ ఆఫర్ ని దీపిక సున్నితంగా తిరస్కరించింది. ఇప్పటికైతే మంచి స్నేహితులం.. ఇలానే ఉందాం అని చెప్పింది. పాపం రణవీర్ సింగ్.. అట్నుంచి ఇది ఊహించి ఉండడు. అందుకే ఒకేసారి ఝలక్ తిన్నాడు. ప్రస్తుతం భాజీరావ్ షూటింగ్ మద్యలో ఉంది కాబట్టి ఈ స్నేహం కొనసాగుతోంది. ఆ తర్వాత ఉంటుందో లేదో అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అదీ సంగతి.