బిగ్ బాస్ 'పిట్ట' బ‌య‌ట‌కు వ‌చ్చేసింది

Update: 2018-08-20 05:31 GMT
ఏదైనా జ‌ర‌గొచ్చ‌న్న ట్యాగ్ లైన్ తో మొద‌లైన బిగ్ బాస్ సీజ‌న్ 2లో ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటివి చాలానే జ‌రిగాయి. ఊహించని రీతిలో ఎలిమినేష‌న్లు.. అదే టైంలో రీఎంట్రీలు చోటు చేసుకున్నాయి. అయితే.. లీకుల పుణ్య‌మా అని  ఉత్కంట అన్న‌ది లేని ప‌రిస్థితి. ఎప్పుడేం జ‌రుగుతుందో ముందే సోష‌ల్ మీడియాలో లీకైపోవ‌టంతో.. బిగ్ బాస్ 2 షో చూసే వారి కంటే.. సోష‌ల్ మీడియాలో ఫాలో అయ్యే వారికే త‌ర్వాతి అప్డేట్ ఏమ‌న్న‌ది ముందే తెలిసిపోతుంది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజ‌న్ 2 అప్పుడే ప‌ద‌కొండు వారాలు పూర్తి అయ్యాయి. వంద రోజుల షోలో దాదాపు స‌గానికంటే ఎక్కువ రోజులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేష‌న్ కు మ‌రో ప‌ది మంది ఉన్నారు. చాలా క‌ష్ట‌ప‌డి రీఎంట్రీ ఇచ్చిన నూత‌న్ నాయుడు అనుకోని రీతిలో గాయ‌ప‌డి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌టం.. అత‌గాడి ఆరోగ్య ప‌రిస్థితి మీద ఎలాంటి అప్డేట్ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేష‌న్ ముప్పు ఎదుర్కొంటున్న ఆరుగురిలో గీతామాధురి.. శ్యామ‌ల శ‌నివారం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా.. మిగిలిన వారిలో దీప్తి సున‌య‌న‌.. నూత‌న్ నాయుడు.. రైడా.. పూజాల‌లో పిట్ట సున‌యన ఈ వారం ఎలిమినేట్ అయ్యారు.

సీక్రెట్ టాస్క్ లో జీవించేసిన సున‌యన ఆనందం ఎలిమినేష‌న్ మాట‌తో షాక్ కు గురైంది. భారంగా హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. సోష‌ల్ మీడియాలో చలాకీగా ఉన్న సున‌య‌న‌.. బిగ్ బాస్ హౌస్ లో అంద‌రి కంటే వ‌య‌సులో చిన్న‌ది కావ‌టం గ‌మ‌నార్హం. ఇన్ స్టాగ్రాంలో త‌న డ‌బ్ స్మాష్ ల‌తో అంద‌రిని ఆక‌ట్టుకొని.. బిగ్ బాస్ సీజ‌న్ 2లో బెర్తుద‌క్కించుకున్న దీప్తి సున‌యిన‌.. అలియాస్ బిగ్ బాస్ పిట్ట బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌న్న అంచ‌నాలు మ‌రోసారి నిజమ‌య్యాయి. ఎలిమినేట్ అయ్యే వారు బిగ్ బాంబ్ ను వేయ‌టం తెలిసిందే.

దీప్తి త‌న బిగ్ బాంబ్ ను త‌నీశ్ పై వేసింది. హౌస్ లో ఎప్పుడూ మ్యూజిక్ ప్లే చేస్తే అప్పుడు స్మిమ్మింగ్ ఫూల్ లో దూకాల‌న్న భారీ బాంబ్ ను త‌నీశ్ మీద వేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలిమినేట్ అయిన వారు వేసిన బిగ్ బాంబ్‌ లో దీప్తి సున‌యనాదే బిగ్ బాంబ్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News