రామ‌ప్ప ఆల‌యానికి దేవ‌ర‌కొండ‌.. సీత‌మ్మ కొండ‌కు?!

Update: 2021-07-11 04:38 GMT
భార‌తదేశానికి గొప్ప చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. దేవుళ్లు దేవ‌త‌లు పురాణేతిహాసాల‌తో గొప్ప అనుబంధం క‌లిగి ఉన్నాం. వీట‌న్నిటికీ సంబంధించిన ఆన‌వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. భార‌త సాంస్కృతిక జీవ‌నం పురాణాతిహాసాల‌తో అనుబంధంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో అధ్య‌య‌నాలు సాగాయి.

భార‌త‌దేశంలోని ఆల‌యాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలంగాణలోని రామప్ప ఆలయం విశిష్ఠ‌త‌ను పాఠ్య పుస్త‌కాల్లోనూ చేర్చారు. తెలంగాణలో మొట్టమొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ స్థ‌లానికి గుర్తింపు ఉంది. అయితే దీనికి యునెస్కో గుర్తింపు కూడా అవ‌స‌రం. తెలంగాణకు చెందిన రామప్ప ఆలయం .. గుజరాత్  ధోలావిరా.. యునెస్కో ప్రపంచ వారసత్వ సైట్ హోదా కోసం భారతదేశం నుంచి నామినేట్ చేయ‌బ‌డ్డాయి.

అయితే ఎంపిక ప్రాసెస్ ఎలా? అంటే.. ప్రపంచ వారసత్వ కమిటీ నామినేషన్లను సమీక్షిస్తుంది. సభ్యుల ఓట్లను బట్టి ఒకదాన్ని ఎంచుకుంటుంది. ప్రపంచ వారసత్వ కమిటీ త్వరలో చైనాలోని ఫుజౌలో సమావేశమవుతుంది. ప్రపంచంలోని అనేక సైట్ లతో జాబితాను ప‌రిశీలించి హిస్టారిక‌ల్ క‌ట్ట‌డాల‌కు యునెస్కో గుర్తింపును ప్ర‌క‌టిస్తారు. నామినీల తుది జాబితాను ప్ర‌క‌టిస్తారు. కమిటీ సభ్యులు గత ఏడాది ఫిబ్రవరిలో రామ‌ప్ప ఆల‌య‌ స్థలాన్ని పరిశీలించి ప్ర‌తిదీ రికార్డ్ చేశారు.

అయితే చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న ఈ ఆల‌యానికి విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌వంతుగా ప్రాచుర్యం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అత‌డు త‌న సోషల్ మీడియాల ద్వారా రామ‌ప్ప ఆల‌య విశిష్ఠ‌త‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా తెలంగాణ‌లో అత్యంత పురాత‌న‌మైన ఆల‌యం రామ‌ప్ప ఆల‌య విశిష్ఠ‌త‌ను సోష‌ల్ పాఠాల్లో చ‌దువుకున్న వారందరికీ ఇప్పుడు అది మ‌ళ్లీ గుర్తుకు వ‌స్తోంది అంటే సెల‌బ్రిటీ ప్ర‌చారం వ‌ల్ల‌నే.

అన్న‌ట్టు ఆంధ్ర ప్ర‌దేశ్ లోనూ ఇలాంటి హిస్టారిక‌ల్ నేప‌థ్యం ఉన్న దేవాల‌యాలు .. స్థ‌లాలు ఉన్నా వాటికి గుర్తింపు  ప్ర‌చారం త‌క్కువే. విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట మండలంలోని గోపాల ప‌ట్నం గ్రామ‌ ప‌రిస‌రాల్లో సీత‌మ్మ వారి కొండ చారిత్ర‌కంగా ఎంతో ప్ర‌సిద్ధి చెందిన‌ది. ఈ కొండ‌మీద చిన్న‌పాటి త‌టాకంలో నిమ్మ పండు వేస్తే అది వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కాశీలో తేలుతుంద‌ని న‌మ్మ‌కం. అందుకే ఆ త‌టాకంలో గంగాజ‌లంలో స్నాన‌మాచ‌రించి సీత‌మ్మ వారికి ప్ర‌తియేటా పూజ‌లు చేస్తుంటారు. ఇక ఈ త‌టాకం ప‌రిస‌రాల్లోనే ఆంజ‌నేయ స్వామి వారి భారీ అడుగు (పాదం గుర్తు) ముద్ర ఉంటుంది. కొన్ని మీట‌ర్ల నిడివితో ఇది ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆంజ‌నేయుడు ఇక్క‌డ కూడా ఒక అడుగు వేశాడ‌ని పురాణం చెబుతోంది. అయితే ఇలాంటి స్థ‌లాల‌కు గుర్తింపు ద‌క్కేలా స్థానిక మీడియా నుంచి ప్ర‌చారం స‌రిగా లేదన్న విమ‌ర్శ‌లున్నాయి. బ‌హుశా ఇలాంటి వాటికి గుర్తింపు తేవాలంటే ఎవ‌రైనా ప్ర‌త్యేకించి సెల‌బ్రిటీ ప్ర‌చారం అవ‌స‌రం. రామ‌ప్ప ఆల‌యానికి దేవ‌ర‌కొండ ప్ర‌చారం చేసిన‌ట్టే.. సీత‌మ్మ కొండ‌కు కచ్ఛితంగా ఎవ‌రైనా సెల‌బ్రిటీల ప్ర‌చారం చేస్తే వ‌ర‌ల్డ్ హెరిటేజ్ స్థ‌లంగా గుర్తింపు ల‌భించే వీలుంది. లైగ‌ర్ చిత్రాన్ని పూర్తి చేసాక దేవ‌ర‌కొండ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News