ప్రేమలేఖ సినిమా చూసిన వాళ్లెవ్వరూ దేవయానిని అంత సులభంగా మరిచిపోలేరు. ఆ తర్వాత సుస్వాగతం, మాణిక్యం లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించి మంచి పేరు సంపాదించిన ఈ కేరళ కుట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చెన్నకేశవరెడ్డి, నాని లాంటి సినిమాల్లో తళుక్కుమంది. ఆ తర్వాత తమిళ డబ్బింగ్ సీరియళ్లతోనే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవయాని.. ఇప్పుడు సినిమాలు, సీరియళ్లు బాగా తగ్గించేసింది. అలాగని ఆమె కేవలం ఇంటికే పరిమితం అయిపోలేదు. తన ఇద్దరు అమ్మాయిలు చదివే స్కూల్లోనే టీచర్‌గా పని చేస్తుండటం విశేషం.
హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడిలా టీచర్ ఉద్యోగం చేయడం ఏంటని అడిగితే.. ‘‘ఇదేం డబ్బు కోసం చేస్తున్న పని కాదు. నా మనసుకు నచ్చి చేస్తున్నది. మా పిల్లల్ని దింపడానికి రోజూ స్కూలుకు వచ్చేవాణ్ని. టీచర్లతో, మేనేజ్‌మెంట్‌తో బాగా మాట్లాడేదాన్ని. నేను మాట్లాడే విధానం, నా ఆలోచనలు, పిల్లల్ని ట్రీట్ చేసే తీరు చూసి.. వాళ్లే పాఠాలు చెప్పమన్నాను. నాకూ వాళ్ల ఆఫర్ నచ్చి టీచర్‌గా చేరాను. టీచింగ్ అంటే సామాన్యమైన విషయం కాదు. ముందు సరదాగానే మొదలుపెట్టాను కానీ.. తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్సు కూడా చేశాను. ఇలా పిల్లలకు పాఠాలు చెబుతుంటే గొప్పగా అనిపిస్తోంది’’ అని చెప్పింది దేవయాని. సినిమాల్లో నటించకూడదని నియమమేమీ పెట్టుకోలేదని.. తన మనసుకు నచ్చి పాత్రలు వచ్చినపుడు తెరపై కనిపిస్తున్నానని దేవయాని చెప్పింది.