విలక్షణ నటుడు, హీరో విక్రమ్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారని, అయినని కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చేరించారని శుక్రవారం మధ్యాహ్నం వార్తలు బయటికి వచ్చాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని, ఫ్యాన్స్ భయపడాల్సిన పని లేదంటూ కుటుంబ సభ్యులతో పాటు కావేరీ హాస్పిటల్ సిబ్బంది వెల్లడించినట్టుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత విక్రమ్ గుండె వాల్స్ బ్లాక్ అయ్యాయని, ఆ కారణంగానే ఆయన హాస్పిటల్ లో చేరారని కోలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తలని ఖండిస్తూ విక్రమ్ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా కావేరి హాస్పిటల్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ విడుదల చేసిన హెల్త్ బులిటిన్ కాపీని షేర్ చేశారు. విక్రమ్ కు ఎలాంటి హార్ట్ ఎటాక్ రాలేదని, చాతిలో చిన్న అసౌకర్యం వల్ల ఆయన హాస్పిటల్ లో చేరారని, మా స్పెషలిస్ట్ డాక్టర్లు ఆయనకు మెరుగైన చికిత్సని అందించారని, త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని కావేరి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో స్పష్టం చేశారు.
దీంతో విక్రమ్ హెల్త్ గురించి ఆందోళనకు గురవుతున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సెలబ్రిటీలు కూడా విక్రమ్ కు హార్ట్ ఎటాక్ రాలేదని తెలియడంతో ఫ్యాన్స్ లాగే ఊపిరి పీల్చుకున్నారు. అయితే తండ్రి విక్రమ్ పై వచ్చిన వార్తలపై ఆయన తనయుడు, 'ఆదిత్య వర్మ' ఫేమ్ ధృవ్ విక్రమ్ ఫైర్ అయ్యారు. విక్రమ్ కు చాతిలో అస్వస్థత కారణంగా హాస్పిటల్ లో చేరితే గుండెపోటు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా తండ్రి విక్రమ్ హార్ట్ ఎటాక్ వార్తలని ఖండిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
ఫ్యాన్స్ ని. శ్రేయోభిలాషులని ఉద్దేశించిన ధృవ్ విక్రమ్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. 'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియజేయునది. నాన్న చిన్నపాటి చెస్ట్ పెయిన్ తో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వెళ్లారు.
ఆయనకు గుండెపోటు వచ్చిందన్నది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఇలాంటి రూమర్స్ విని మా ఫ్యామిలీ చాలా బాధపడింది. ఈ సమయంలో మా ఫ్యామిలీకి, నాన్నకు కాస్త ప్రైవసీని ఇస్తారని ఆశిస్తున్నాను. నాన్న బాగానే వున్నారు. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. ఈ స్టేట్‌మెంట్ రూమర్స్ కి చెక్ పెట్టి వాస్తవాన్ని తెలియజేస్తుందని నమ్ముతున్నాను' అని ధృవ్ విక్రమ్ వెల్లడించారు.
ప్రస్తుతం ధృవ్ విక్రమ్ షేర్ చేసిన స్టేట్మెంట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా వుంటే విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ -1' టీజర్ శుక్రవారం సాయంత్రం ఐదు భాషల్లో విడుదలైంది. 'బాహుబలి' స్ఫూర్తితో రూపొందుతున్న ఈ మూవీ విజువల్స్ పరంగానూ అబ్బురపరుస్తోంది. మణిరత్నం ఈ మూవీతో రాజమౌళిని మరిపించబోతున్నారా? అని ఈ మూవీ విజువల్స్, గ్రాండీయర్ చూసిన వారంతా అవాక్కవుతున్నారు.