దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగాఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ట్రిపుల్ ఆర్ రాపనే వచ్చేసింది. దాదాపు మూడున్నరేళ్లుగా ఎదురుచూసిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. తొలి రోజు తొలి షో నుంచే సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రికార్డులని తిరగరాస్తూ ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది.
అయితే ఈ మూవీలో నటించిన ఎన్టీఆర్ పాత్రకు దర్శకుడు రాజమౌళి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా చూసిన చాలా మంది ఎన్టీఆర్ ని మరీ తక్కువ చేసి చూపించి రామ్ చరణ్ ని హీరోని చేశారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఓపెన్ లెటర్ వైరల్ గా మారి పలువురిని ఆకట్టుకుంటోంది. థాంక్యూ అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఓ లెటర్ ఇప్పుడు నెట్టంట సందడి చేస్తోంది.
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి మీ ప్రేమని మాపై చూపిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ని ఈ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ మూవీ నా కెరీర్ లో లాండ్ మార్క్ చిత్రంగా నిలిచింది. నేను నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ఇన్స్ పైర్ చేసిన జక్కన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా నాలోని బెస్ట్ ని బయటికి తీసుకొచ్చి నేనొక వాటర్ లా ఫీలయ్యేలా చేశావు.
నేను నా పాత్రలో పరిపూర్ణంగా నటించడానికి, నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి ఈజ్ తో చేయడానికి మీ కన్వెక్షన్ బాగా సహయపడింది. చరణ్ నీవు లేకుండా నేను ట్రిపుల్ ఆర్ లో నటిచడాన్ని ఊమించుకోలేను. అల్లూరి సీతారామరాజు పాత్రకు నువ్వు తప్ప మరెవరూ న్యాయం చేసేవారు కాదు. అలాగే నువ్వు లేకుండా భీం పాత్ర అసంపూర్తిగానే మిగిలిపోయేది. నాకు నీ ఫైర్ ని అందించినందుకు ధన్యవాదాలు బ్రదర్.
లెజెండరీ యాక్టర్ అజయ్ సర్ తో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అలియా నువ్వోక పవర్ హౌస్. ఈ చిత్రానికి అద్భుతమైన న ఈబలాన్నిచ్చావు. ఒలివియా మోరీస్, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ వారి నటనతో హృదయాల్లో నిలిచిపోయారు. వారికి ఇండియన్ సినిమా తరుపున స్వాగతం పలుకుతున్నాను. డీవీవీ దానయ్య గారు యు ఆర్ రాక్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నిర్మించినందుకు ధన్యవాదాలు. ట్రిపుల్ ఆర్ మూవీకి సంగీతంతో లైఫ్ ఇచ్చినందుకు కీరవాణి గారికి నా సిన్సియర్ థాంక్స్. మీరు ఈ చిత్రానికి అందించిన సంగీతం మన సంస్కృతి సంప్రదాయాలని ఎల్లలు దాటింది.
విజయేంద్ర ప్రసాద్ గారు భారతీయ సినిమాల్లో అత్యుత్తమ కథలని అందిస్తున్నారు. ఆయన కథలు ప్రపంచ వ్యాప్తంగా వున్న మిలియన్ ల ఫ్యాన్స్ ని, సినీ లవర్స్ హృదయాలని గెలుచుకుంటోంది.. అంటూ ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా ఎన్టీఆర్ గుర్తు చేసుకున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇదే సందర్భంలో మరో క్వశ్చన్ ని రైజ్ చేస్తోంది. ఎన్టీఆర్ హార్ట్ అయ్యారు కాబట్టే ఈ రేంజ్ లో ఓపెన్ లెటర్ రాశారని, తన పాత్రని తగ్గించి చరణ్ పాత్రని పెంచిన తీరు ఎన్టీఆర్ ని బాధించిందని, అందుకే ఇండైరెక్ట్ గా ఎన్టీఆర్ పేరు పేరునా అందరిని గుర్తు చేస్తూ ఈ లెటర్ ని పోస్ట్ చేశాడని అభిమానులు భావిస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఓ పెన్ థాంక్యూ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.