ఈ మధ్య కాలంలో ఏ నిర్మాత పై రానన్న వార్తలు.. ఎలిగేషన్స్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పై వచ్చాయి. ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు గిల్డ్ తరుపున ప్రకటించిన దిల్ రాజు.. ఆ తరువాత నిర్మాతల మండలి నుఏంచి తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన దిల్ రాజు వారిని కూడా ఫైనల్ గా తన దారికి తెచ్చుకుని సినిమాల షూటింగ్ ల బంద్ ని ప్రకటించడం తెలిసిందే.
అయితే ఈ క్రమంలో తను విజయ్ తో నిర్మిస్తున్న `వారసుడు` షూటింగ్ ని కంటిన్యూ చేయడంతో మరోసారి టాలీవుడ్ నిర్మాతల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇది తమిళ ఈ మూవీ అని, తెలుగు సినిమా కాదని, అందుకే తన సినిమా షూటింగ్ ని ఆపలేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ చాలా వరకు నిర్మాతలకు మాత్రం దిల్ రాజు కావాలనే ఆలా అంటున్నాడని, మా సినిమాలని మాత్రం నిలిపివేయించాడని ఓ వ్యతిరేకత భావం ఏర్పడింది.
అదే ఇప్పడు `వారసుడు` రిలీజ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించడం.. ఆ సినిమాని వివాదానికి కేంద్ర బిందువుగా చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై మిగతా వాళ్లు స్పందిస్తున్నా తిల్ రాజు మాత్రం పెదవి విప్పడం లేదేంటని అంతా ఆసక్తిగా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఫైనల్ గా దిల్ రాజు ఈ వివాదంపై స్పందించారు. తాజాగా ఓ ఛానల్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించి షాకిచ్చాడు.
`వారసుడు` వివాదం వెనక ఎవరున్నారో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఈ వివాదం ఎంతుకు ఎలా మొదలైందో కూడా తెలుసని చెప్పడం గమనార్హం. అయితే ఈ సందర్భంగా అసలు సీక్రెట్ లు మాత్రం బయటపెట్టకపోవడం గమనార్హం. మోనోపలి గురించి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు నా చేతిలో కేవలం 37 థియేటర్లు మాత్రమే వున్నాయని, వాటితో మోనోపలి ఎలా చేయగలనని ఎదురు ప్రశ్నించాడు. కానీ అసలు సీక్రెట్ ని మాత్రం బయటపెట్టలేదు.
నైజాం డిస్ట్రిబ్యూషన్ లో కీ రోల్ పోషిస్తున్న దిల్ రాజు ఉత్తరాంధ్రలో కీలక థియేటర్లని తన ఆధీనంలో పెట్టుకున్నాడన్నది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే అక్కడే దిల్ రాజుకు 37 థియేటర్లున్నాయి. ఆ లెక్క చెప్పాడే కానీ నైజాం లో తన చేతిలో వున్న థియేటర్ల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అక్కడ కూడా నైజాం రేంజ్ లోనే బిజినెస్ చేస్తూ మోనోపలి చేస్తున్న దిల్ రాజు ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడం విడ్డూరంగా వుందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
అంతే కాకుండా తను కీలక థియేటర్ల పరంగా ఓ సిండికేట్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ కమాండింగ్ వల్లే అందరికి తెలిసే లోపే అన్ని ఏరియాలకు సంబంధించిన ప్రధాన థియేటర్లని తన `వారసుడు` సినిమా కోసం బ్లాక్ చేసుకున్నాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.