చూస్తుంటే దిల్ రాజు మల్టీస్టారర్ సినిమాలపైనే దృష్టిపెట్టినిపిస్తోంది. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`తో టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ కి మరోసారి తెర తీసింది ఆయనే. ఏ ఇద్దరు కథానాయకులైనా కలిసి నటించాలని నిర్ణయించుకొంటున్నారంటే అది `సీతమ్మ...` సక్సెస్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యేడాది ఆ చిత్రాల జోరు మరింతగా కనిపిస్తోంది. దిల్రాజు సంస్థలోనే మూడు చిత్రాలు తెరకెక్కుతున్నాయి.
వెంకీ - వరుణ్ తేజ్ ల `ఎఫ్2`తో పాటు - మహేష్ బాబు - అల్లరి నరేష్ ల చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. నిన్ననే మోహనకృష్ణ ఇంద్రగంటితోనూ ఓ సినిమాని ప్రకటించారు దిల్ రాజు. అందులో నాని - శర్వానంద్ కలిసి నటించబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఆ చిత్రం ఈ యేడాదే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికంటే ముందే దిల్ రాజు - హరీష్ శంకర్ కలయికలో `దాగుడుమూతలు` అనే మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్నట్టు ప్రకటన వెలువడింది. అందులో నితిన్ - శర్వానంద్ కలిసి నటిస్తారని కూడా ప్రచారం సాగింది. మరేమైందో ఏంటో కానీ.. ఆ చిత్రానికి సంబంధించిన ఊసే లేదు. `ఎఫ్2` కంటే ముందే ప్రకటించినా ఇప్పటిదాకా ఆ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లకపోవడానికి కారణమేంటో తెలియదు మరి!