టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్.. తొలిసారిగా హిందీలో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. గతంలో గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ ఓ హిందీ చిత్రం చేశాడు కానీ.. తెలుగులో వచ్చిన చిరంజీవి మూవీ ఠాగూర్ కి హిందీ వెర్షన్. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో చారిత్రక చిత్రాలను తీయడంలో తన ప్రతిభ ఎలాంటిదో ప్రూవ్ చేసుకున్న క్రిష్.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
హిందీ.. తెలుగు.. తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగానే సాగుతోంది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర కావడంతో.. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ దండిగా ఉంటాయనే సంగతి అర్ధమయిపోతుంది. అయితే.. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. బ్రేవ్ హార్ట్.. ది బోర్న్ ఐడెంటిటి.. రెసిడెంట్ ఈవిలి రెట్రిబ్యూషన్ వంటి చిత్రాలకు స్టంట్స్ అందించిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే ఇతని ఆధ్వర్యంలో కత్తి యుద్ధాలు.. గుర్రపు స్వారీ వంటి వాటిపై కంగనాకు ఫుల్లుగా ట్రైనింగ్ ఇచ్చేశారు.
లీడ్ రోల్ చేస్తున్న కంగనకే కాదు.. హైద్రాబాద్ నుంచి 300 మంది ఫైటర్లను ప్రత్యేకంగా ముంబై తీసుకెళ్లి.. అక్కడ సుదీర్ఘమైన ట్రైనింగ్ ఇచ్చి మరీ యాక్షన్ సీన్స్ తీస్తున్నారట. ఇండియన్ ఫిలిమ్స్ లో ప్రత్యేకించి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లో ఇంతలేసి యాక్షన్ స్టంట్స్ చూడడం ఈ సినిమాతోనే మొదలు అంటున్నారు.