2000వ సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం' సినిమా సెన్సేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా అప్పట్లో యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా తో ఎంతో మంది నటీ నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా దర్శకుడు తేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంత ప్రత్యేకమైన సినిమా కు దర్శకుడు తేజ ఇటీవలే సీక్వెల్ ను ప్రకటించాడు. 'చిత్రం 1.1' అంటూ టైటిల్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. ఈ సీక్వెల్ లో కొత్త నటీ నటులు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బామ్మర్థి అయిన నితిన్ చంద్ర హీరోగా పరిచయం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో నటించబోతున్నది నితిన్ చంద్ర కాదట.
తేజ తన కొడుకు అమితోవ్ తేజ ను ఈ సీక్వెల్ తో పరిచయం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమితోబ్ తేజ ఒకటి రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు. ఇప్పుడు అమితోవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఎంతో మంది నటీ నటులను వెండి తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ 'చిత్రం 1.1' తో తన కొడుకును హీరోగా పరిచయం చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈనెల 18న జరుగబోతున్నట్లుగా చెబుతున్నారు. చిత్రం ప్రారంభోత్సవం సందర్బంగా సినిమా హీరో ఎవరు అనే విషయమై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దర్శకుడు తేజ ఈమద్య కాలంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మినహా మరే సినిమాతో సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. ఇటీవల వచ్చిన సీత సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో తేజకు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. సినిమా సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. కనుక దర్శకుడు తేజ చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్ ను చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిత్రం 1.1 పూర్తి వివరాలు మరి కొన్ని రోజుల్లో వెళ్లడయ్యే అవకాశం ఉంది.