డీజే విధ్వంసం మొదలైపోయింది!

Update: 2017-05-22 13:23 GMT

Full View

డీజే - దువ్వాడ జగన్నాధం.. టాలీవుడ్ ప్రస్తుతం ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. బాహుబలి2 తర్వాత అన్నీ చిన్న సినిమాలే వస్తుండగా.. భారీ చిత్రాల హంగామా బిగిన్ అయ్యేది అల్లు అర్జున్ సినిమాతోనే. డీజే ఆడియో త్వరలో ఇవ్వబోతున్నామంటూ రీసెంట్ గా ఆడియో టీజర్ కూడా రిలీజ్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్.

ఇప్పుడు డీజేలోని మొదటి పాట ఆన్ లైన్ లోకి వచ్చేసింది. మొదటగా టైటిల్ సాంగ్ తోనే ఆడియో విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. బన్నీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరైనోడు మాదిరిగా ఒక్కొక్క పాటనే విడుదల చేయనున్నారనే సంగతి అర్ధమైపోతోంది. శరణం భజే భజే అనే ట్యూన్ కి.. 'విధ్వంసకారుడెవరు..' అనే టైపులో  ప్రశ్నిస్తూ.. జవాబుగా 'డీజే డీజే' అంటూ రాసిన లిరిక్ సూపర్బ్ గా ఉంది. అల్లు అర్జున్ పోషిస్తున్న పాత్రను ఎలివేట్ చేసే మాదిరిగా ఈ పాట ఉండనుందనే సంగతి అర్ధమవుతోంది. టైటిల్ సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సూపర్బ్ గా ఉంది. సంస్కృత పదాలకు తగినట్లుగా మ్యూజిక్ ని సింక్ చేసిన తీరు అదిరిపోయిందని చెప్పాలి.

ఈ లిరికల్ సాంగ్ కు.. మూవీలోని కొన్ని స్టిల్స్ ను కూడా జత చేసి రిలీజ్ చేయడంతో.. విజువల్ గా కూడా ఆకట్టుకుంటోంది. మరోవైపు.. ఈ పాటకు కూడా డిజ్ లైక్స్ హంగామా అప్పుడే మొదలైపోవడం ఆశ్చర్యకరమే.

Tags:    

Similar News