సిద్దు హీరోగా నేహా జంటగా రూపొందిన డీజే టిల్లు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా స్క్రిప్ట్ మరియు మేకింగ్ విషయంలో త్రివిక్రమ్ ఇన్ పుట్స్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.
సినిమా పై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత యూత్ లో అమాంతం అంచనాలు పెరగడంతో మంచి టైమ్ లో రిలీజ్ చేశారు.
ఖిలాడి సినిమా విడుదల అయిన రోజే ఈ సినిమా ను విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఒక్క రోజు ఆలస్యంగా విడుదల చేయడం జరిగింది.
ఖిలాడి సినిమా కు నెగటివ్ టాక్ రావడంతో ఆ సినిమా కు రెండవ రోజు నుండే వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అదే సమయంలో వచ్చిన డీజే టిల్లు సందడి థియేటర్లలో మొదలు అయ్యింది. మల్టీ ప్లెక్స్ లు.. సింగిల్ స్క్రీన్స్ అనే తేడా లేకుండా దుమ్ము దుమ్ముగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.
నైజాం ఏరియాలో ఈ సినిమా మొదటి రోజే దాదాపుగా బ్రేక్ ఈవెన్ వసూళ్లను నమోదు చేసిందనే ప్రచారం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలిగించింది. డీజే టిల్లు ఏపీలో కూడా భారీగా నే రాబట్టింది.
అక్కడ టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా కూడా బ్రేక్ ఈవెన్ సాధ్యం అయ్యింది. ఇంతకు ముందు మాదిరిగా ఏపీలో టికెట్ల రేట్లు ఉంటే మొదటి రెండు రోజుల్లోనే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ నమోదు అయ్యేది.
యూఎస్ తో పాటు విడుదల అయిన అన్ని చోట్ల కలిపి ఓవరాల్ గా నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధ్యం అయ్యింది. సినిమా దాదాపుగా 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసిందట. 9.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు మొదటి నాలుగు రోజుల్లో 10.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. నాలుగు రోజుల్లోనే కోటి రూపాయల లాభాలను ఈ సినిమా తెచ్చి పెట్టింది.
వీక్ డేస్ లో కూడా డీజే టిల్లు వాయింపు కొనసాగుతుంది. ఈ వారంలో పెద్ద సినిమాలు క్రేజీ సినిమాలు పెద్దగా లేవు. కనుక డీజే టిల్లు దే ఈ వారం కూడా అంటున్నారు.
ఇప్పటికే వచ్చిన వసూళ్లకు దాదాపుగా డబుల్ వసూళ్లు వస్తాయంటూ ట్రేడ్ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సింగిల్ స్క్రీన్స్ ను పెంచుతున్నారని కూడా సమాచారం అందుతోంది.
సినిమా కు ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు ఒక లెక్క అయితే ఇక నుండి రాబోతున్న వసూళ్లు మొత్తం కూడా లాభాలే. కనుక మేకర్స్ సినిమాను మరింతగా పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే సమయంలో మౌత్ పబ్లిసిటీ కూడా సినిమా కు బాగా లభించింది. కనుక యూత్ ఆడియన్స్ ఈ వీకెండ్ కు డీజే మోత కు వెళ్లడం ఖాయంగా అనిపిస్తుంది. అదే జరిగితే ఊహించని వసూళ్లు డీజే టిల్లు దక్కించుకునే అవకాశం ఉంది.