గత కొన్ని నెలలుగా టాలీవుడ్ సినిమాల ఓవర్సీస్ మార్కెట్ స్ట్రగుల్ అవుతోంది. కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా భారీ రేట్ ఇచ్చి కొనుగోలు చేసి ఇబ్బందులు పడ్డారు. ఒకటీ అరా లో బడ్జెట్ సినిమాలు భారీ లాభాలు పంచినా.. కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాలేని పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషన్ లో నిఖిల్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీఫ్ ఇచ్చింది.
ఓవర్సీస్ లో ఈ మూవీ 50 లక్షల రూపాయలకు మాత్రమే విక్రయించగా.. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రతీ ఒక్కరు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిపోయారు. ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కును దాటేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్ లో మిలియన్ డాలర్ మూవీగా అవతరించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉండడం.. నిఖిల్ తో పాటు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లను కూడా సంతోషంలో ముంచెత్తే విషయమే. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నావాడు కుమ్మేస్తున్నాడు. వీకెండ్స్ లో మాత్రమే కాకుండా వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతుండడం.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది.
కరెన్సీ కొరత మొదలయ్యాక సినిమాలను విడుదల చేయాలా వద్దా అనే సందిగ్ధతలో జనం కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. ఎక్కడికి పోతావు చిన్నవాడా సక్సెస్ కావడం.. మొత్తం ఇండస్ట్రీకే జోష్ ఇచ్చింది. కొత్త సినిమాల రిలీజ్ ల విషయంలో.. ఓ క్లారిటీ వచ్చేందుకు హెల్ప్ అయ్యాడు చిన్నవాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/