అభిమానుల్లో ఓ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఆ సినిమాకు సంబంధించి నటీనటులతో పాటు కథ కూడా బాగుండాలి. అలాగే మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్లు, ట్రైలర్లు... అద్భుతంగా ఉండాలి. వాటిని చూసే చాలా మంది సినిమాలపై ఆసక్తి ఏర్పడుతుంది. కానీ ఇవే బాగాలేకపోతే సినిమాపైనే ఎఫెక్ట్ పడుతుంది. ఆది పురుష్ సినిమాకు కూడా ఇదే జరిగింది. ట్రైలర్ ఒక్కటి బాలేకపోవడంతో సినిమాపైనే తీవ్ర ప్రభావం పడింది.
ఆదిపురుష్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో సినిమాను ఆరు నెలల పాటు వాయిదా వేసిందీ చిత్రబృందం.
ముందుగా జనవరి 12వ తేదీన సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ.. వాయిదా పడడంతో జూన్ 16వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ఆదిపురుష్ టీం ప్రకటించింది.
ఈ క్రమంలోనే #150DaystoAdipurush అనే హ్యాష్ ట్యాగ్ తో సినిమాను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ అనుకున్న రేంజ్ లో దీనికి రెస్పాన్స్ రాలేదు.
అయితే గతంలో రిలీజ్ చేసిన టీజర్ పై విమర్శలు రావడంతో సినిమా వీఎఫ్ఎక్స్ ను మార్చారు మూవీ మేకర్స్. ఆ పని పూర్తి కావడంతో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ సినిమాను ట్రెండ్ చేయాలనుకున్నారు. కానీ కొత్త ట్రైలర్ కు బదులుగా ఇలాంటి హ్యాష్ టాగ్స్ ఇవ్వడంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపిచడం లేదు.
ఇప్పటికైనా ఇలా హ్యాష్ ట్యాగ్ లు, పోస్టర్ లతో కాకుండా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో కూడిన ట్రైలర్ ను రిలీజ్ చేయాలని పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే సినిమాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. మరి చిత్ర బృందం సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్ ను ఎప్పుడు విడుదల చేస్తారో లేదా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.