హాలీవుడ్ ఫ్యావరెట్ కపుల్స్ గా పేరొందిన బ్రాడ్ పిడ్- ఎంజెలీనా జోలీ జంట పెళ్లైన కొన్నాళ్లకే మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయ్యారు.
అయితే తాజాగా మాజీ భార్యపై బ్రాడ్ పిడ్ కేసు వేసాడు. దీంతో పరిస్థితి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే సుఖమేమి అన్న చందంగా తయారైంది. ఇంతకీ అంతటి కష్టం బ్రాడ్ ఫిడ్ కి ఏమొచ్చిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.
ఈ జంట అన్యోన్యంగా ఉన్న కాలంలో సొంతంగా ఓ కంపెనీ పెట్టారు. కాలక్రమేణా ఆ కంపెనీ వృద్దిలోకి వచ్చింది. అయితే బ్రాడ్ తో వివాహ బంధం తెగిపోయిన తర్వాత ఎంజెలీనా కంపెనీలో తన వాటాని వేరే వాళ్లకి అమ్మేసింది. ఇక్కడే ఎంజెలీనా మాజీ ప్రియుడ్ని ఘోరంగా మోసం చేసింది. తన షేర్లను అమ్మేస్తున్న సంగతి బ్రాడ్ పిడ్ కి చెప్పకుండా సైలెంట్ గా అమ్మేసిందిట. దీంతో బ్రాడ్ పిడ్ ఇబ్బందుల్లో పడ్డాడు. కంపెనీ కొత్త ఓనర్లు ఇప్పుడు కంపెనీ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అందులో భాగస్వామిగా ఉన్న బ్రాడ్ పిడ్ పై అజమాయిషీ చెలాయిస్తున్నారుట. ఈ కంపెనీలో నువ్వు ఎవరు? అనే వరకూ సీన్ వచ్చిందిట. పెట్టుబడి పెట్టిన బ్రాడ్ కి ఎలాంటి విలువ ఇవ్వకుండా కొత్త మేనేజ్ మెంట్ వ్యవహరిస్తోందని బ్రాడ్ పిడ్ లబోదిబో మంటున్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు లో ఉంది. కోర్టు తీర్పు కూడా ఎంజెలీనాకే మద్దతుగా కనిపిస్తుంది.
విక్రయ సమయంలో బ్రాడ్ పిడ్ అనుమతి తీసుకోలేదని కోర్టు తెలిపినా .. విడాకులు విచారణ సమయంలో తన షేర్లు కొనేందుకు కొందరు సిద్దంగా ఉన్నట్లు కోర్టు విచారణలో తేలింది. దీంతో ఈ కేసు ఎటు తేలకుండా మరోసారి వాయిదా పడింది. అలా బ్రాడ్ పిడ్ మధ్యలో ఇరుక్కున్నారు.
మరి మాజీ భార్య బ్రాడ్ పిడ్ పై ఇంతగా ఎందుకు కక్షగట్టినట్లో? విక్రయించే క్రమంలో సూచన ప్రాయంగా హింట్ ఇచ్చినా... బేరం తెగిన సమయంలో ఎందుకు సీక్రెట్ గా ఉంచినట్లు? విదేశీ చట్టాల ప్రకారం భరణం చెల్లించడంలో బ్రాడ్ పిడ్ ఏమైనా తక్కువ చేసాడా? అన్నది మరో సందేహం. కారణాలు ఏవైనా మాజీ కారణంగా బ్రాడ్ పిడ్ కి కోర్టు తిప్పలు తప్పలేదు.