కుమారి కుమ్మేస్తోంది బాబోయ్

Update: 2015-11-21 07:30 GMT
కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఏమీ ఉండదని మరోసారి రుజువైంది. ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ అంచనాల్ని మించి బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ రావడం.. పైగా ఓన్లీ ఫర్ యూత్ అన్న ముద్ర కూడా పడటం యువ ప్రేక్షకులతో థియేటర్లు ప్యాక్ అవుతున్నాయి. ఉదయం కంటే కూడా మధ్యాహ్నం నుంచి క్రౌడ్ ఎక్కువైందని.. సాయంత్రమైతే విడుదలైన ప్రతి చోటా హౌస్ ఫుల్సే అని రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా ఓపెనింగ్స్ విషయంలో కూడా కళ్లు చెదిరే ఫిగర్స్ రావొచ్చని తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా థియేట్లలో ‘కుమారి 21 ఎఫ్’ను రిలీజ్ చేశారు. యుఎస్ లో కూడా దాదాపు వంద స్క్రీన్స్ ఇవ్వడం, చాలా చోట్ల ప్రిమియర్స్ కూడా వేయడం.. సుకుమార్ సినిమాకున్న క్రేజ్ ను తెలియజేస్తోంది. ప్రిమియర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నారు. తొలి రోజు వరల్డ్ వైడ్ షేర్ రూ.4 కోట్ల పైనే ఉండొచ్చని అంటున్నారు. చిన్న సినిమాల విషయంలో ఇది చాలా పెద్ద ఫిగరే. ఫుల్ రన్ లో సినిమా రూ.20 కోట్లకు పైనే కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. సినిమా బడ్జెట్ పారితోషకాలన్నీ కలిపినా కూడా రూ.10 కోట్ల లోపే అంటున్నారు. సుక్కు ఇంకా తన మిత్రులు దేవిశ్రీ ప్రసాద్ - రత్నవేలులకు రెమ్యూనరేషన్లేమీ ఇవ్వలేదు. హీరో హీరోయిన్లకు కూడా పారితోషకాలు తక్కువే. కాబట్టి సినిమా పెట్టుబడి మీద బాగానే లాభాలు ఆర్జించే అవకాశముంది.
Tags:    

Similar News