సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా.. తమ పిక్చర్ అవుట్ పుట్ పై నమ్మకంతో బరిలో దిగాడు ఎక్స్ ప్రెస్ రాజా. అంచనాలకు తగ్గట్టుగానే హిట్ కొట్టేశాడు కూడా. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టెయినర్ కి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే.. పొంగల్ రిలీజ్ లు అన్నిటిలోనూ మొదట సేఫ్ జోన్ లోకి వచ్చేసింది ఎక్స్ ప్రెస్ రాజానే అంటే ఆశ్చర్యం వేయకమానదు.
లో బడ్జెట్ తెరకెక్కడం శర్వా మూవీకి అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్. 5.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఎక్స్ ప్రెస్ రాజా.. మొదటి వీకెండ్ నాలుగు రోజులు ముగిసేసరికి 7.5 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. సినిమాను యూవీ క్రియేషన్స్ ఓన్ గా విడుదల చేసుకోవడంతో.. లాభాల లెక్క మొత్తం ప్రొడక్షన్ కంపెనీకే వెళ్లనుంది. ఇప్పటికే 5.5 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
ఐదున్నర కోట్లతో తెరకెక్కిన ఎక్స్ ప్రెస్ రాజాకి.. రిలీజ్ ఖర్చులతో కలిపి 7.5 కోట్లు అయిందని అంచనా. ఈ మొత్తాన్ని తేలిగ్గానే దాటేస్తాడు వసూల్ రాజా. మేర్లపాక గాంధీకి డైరెక్టర్ గా మరో హిట్ లభించినట్లేననే విషయం ఫిక్స్ అయిపోయింది. అరంగేట్రంలోనే హిట్ కొట్టిన సురభికి కూడా మంచి రోజులే అంటున్నారు. దాదాపు రెమ్యూనరేషన్ కూడా నటించాల్సిన పరిస్థితిలో చేసినా.. సక్సెస్ కారణంగా అంతకంటే ఎక్కువ మొత్తమే శర్వానంద్ కి దక్కనుందట.