చిత్రం : 'ఎఫ్-2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్'
నటీనటులు: వెంకటేష్-వరుణ్ తేజ్-తమన్నా-మెహ్రీన్ కౌర్-ప్రకాష్ రాజ్-రాజేంద్ర ప్రసాద్-ప్రియదర్శి-ప్రగతి-రఘు బాబు-వెన్నెల కిషోర్- వై.విజయ-అన్నపూర్ణ-అనసూయ-నాజర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: శిరీష్
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
సంక్రాంతి సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
వెంకీ (వెంకటేష్) ఒక ఎమ్మెల్యే దగ్గర పీఏగా పని చేస్తుంటాడు. అతను ఒక మ్యాట్రిమొనీ ద్వారా వచ్చిన సంబంధం నచ్చి హారిక (తమన్నా)ను పెళ్లాడతాడు. పెళ్లయిన కొత్తలో అన్నీ బాగానే అనిపిస్తాయి కానీ.. ఆ తర్వాత భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక పోతుంటాడు. ఇలాంటి సమయంలోనే హారిక చెల్లెలైన హనీ (మెహ్రీన్)ను ప్రేమించిన వరుణ్ (వరుణ్ తేజ్) వెంకీకి తోడవుతాడు. అతడికి పెళ్లి కాక ముందే హనీ నుంచి వేధింపులు మొదలవుతాయి. ఓ వైపు హనీతో తన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా.. వెంకీతో కలిసి వరుణ్ యూరప్ టూర్ కు వెళ్లిపోతాడు. ఇలా అర్ధంతరంగా తమను విడిచి వెళ్లిపోయిన వెంకీ.. వరుణ్ లతో హారిక-హనీ ఎలా వ్యవహరించారు.. ఈ జంటలు మళ్లీ కలిశాయా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
దర్శకుడు అనిల్ రావిపూడి తొలి సినిమా ‘పటాస్’.. ఆ తర్వాత తీసిన ‘సుప్రీమ్’.. ‘రాజా ది గ్రేట్’.. ఈ మూడింట్లోనూ కనిపించే కామన్ ఫ్యాక్టర్.. వాటికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం కామెడీ. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న అనిల్.. కామెడీ పండించడంలో తన ప్రత్యేకతను ఆ మూడు సినిమాల్లోనూ చూపించాడు. అతను వినోదం పండించే తీరు మరీ కొత్తగా ఏమీ అనిపించదు. అలాగని మరీ ముతకగానూ అనిపించదు. మధ్యస్థంగా ఉండి అందరికీ కనెక్టయ్యేలా ఉంటుంది. ప్రేక్షకులు ఈజీగా రిలేట్ చేసుకునే పాత్రలు.. సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి.. షార్ప్ డైలాగ్స్ తో వినోదం పండిస్తాడతను. అలాంటి దర్శకుడు కామెడీ పండించడానికి ఎవర్ గ్రీన్ అనదగ్గ ‘భార్యా బాధితుడు’ పాత్ర చుట్టూ కథను రాసుకున్నాడు. పైగా ఆ పాత్రకు వెంకీ లాంటి సూపర్ కామెడీ టైమింగ్ ఉన్న నటుడిని ఎంచుకున్నాడు. ఇక వినోదానికి ఢోకా ఏముంది?
సరైన పాత్ర పడితే కామెడీ ఇరగతీసే వెంకీ.. చాన్నాళ్ల తర్వాత ఆ తరహా పాత్రే పడటంతో చెలరేగిపోయాడు. అనిల్ రైటింగ్.. వెంకీ టైమింగ్ సరిగ్గా కుదిరి ఒక దశ వరకు ‘ఎఫ్-2’ కడుపు చెక్కలయ్యేలా చేస్తుంది. సగం సినిమాకే టికెట్ డబ్బులు గిట్టుబాటు చేసేస్తుంది. కానీ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే టైటిల్ కు న్యాయం చేయడానికేమో అన్నట్లుగా.. ద్వితీయార్ధానికి వచ్చేసరికి ‘ఎఫ్-2’ మరీ సాధారణంగా తయారై ఫ్రస్టేట్ చేస్తుంది. రెండో అర్ధం ఓ మోస్తరుగా సాగినా కూడా ఒక స్థాయిలో నిలిచే అవకాశమున్న చిత్రాన్ని ఒక దశా దిశా లేకుండా మరీ సిల్లీగా నడిపించడం.. ఇల్లాజికల్ సీన్లతో టైంపాస్ చేయడానికి ప్రయత్నించడంతో ద్వితీయార్దంలో గ్రాఫ్ పడిపోయి ఒక సగటు సినిమాలాగే ముగుస్తుంది ‘ఎఫ్-2’.
‘ఎఫ్-2’ సినిమాకు ప్రధాన బలం వెంకీనే. కామెడీ విషయంలో వెంకీకి తిరుగులేదన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ వెంకీని పూర్తి స్థాయి కామెడీ పాత్రలో చూసి చాలా కాలం అయిపోయింది. ‘మల్లీశ్వరి’ తర్వాత ఆ స్థాయిలో వెంకీ అలరించిన సినిమా ఏదీ రాలేదు. ‘ఎఫ్-2’లో వెంకీ క్యారెక్టర్ ఆ రోజుల్ని గుర్తుకు తెస్తుంది. ప్రథమార్ధంలో వెంకటేష్ స్టీల్స్ ద షో అని చెప్పాలి. భార్యా బాధితుడిగా అతను చెలరేగిపోయి నటించాడు. ఒక సీన్లో అనుకోకుండా ఒక ఇంట్లోకి దూరి కుక్కకు దొరికిపోతాడు వెంకీ. ఒకసారి కిందికి వంగి అది మగ కుక్కే అని కన్ఫమ్ చేసుకుని భార్య వల్ల తాను పడే కష్టాలు చెప్పనారంభిస్తాడతను. బ్యాగ్రౌండ్లో ‘రాజా’ సినిమా క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ వస్తుంటే వెంకీ ఇచ్చే హావభావాలకు ఎవ్వరైనా పడి పడి నవ్వాల్సిందే. అనిల్ రావిపూడి సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిదో చెప్పడానికి ఈ సీన్ ఒక ఉదాహరణ. ప్రథమార్ధంలో ఇలా ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసే సీన్లు చాలానే ఉన్నాయి. మంచి ఫ్లోలో సాగిపోయే ప్రథమార్ధంలో బోర్ కొట్టించే సీన్ అన్నదే లేదు. వెంకీ అనే కాదు.. ఫస్టాఫ్ వరకు దాదాపుగా ప్రతి పాత్రా ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా పెళ్లి కాని అనిల్.. పెళ్లయిన తర్వాత భర్తల్ని భార్యలు ఎలా ఏడిపిస్తారో చాలా ఫన్నీ సీన్లతో కన్వే చేశాడు. పెళ్లి చూపుల టైంలో వెంకీ చూపించే అత్యుత్సాహం భలేగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇదే తరహాలో సాగే వరుణ్ పెళ్లిచూపుల సన్నివేశాన్ని మరింత హిలేరియస్ గా డీల్ చేశాడు అనిల్. ఇంటర్వెల్ కార్డ్ పడే సమయానికే ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చూసిన భావన కలిగించాడతను.
ఐతే ప్రథమార్ధం చూసి ద్వితీయార్ధం మీద ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం కానీ.. ‘ఎఫ్-2’ ఆ అంచనాలకు దరిదాపుల్లోనూ నిలవదు. కొంచెం కథ చెప్పాల్సిన చోట అనిల్ తేలిపోయాడు. ముందు నుంచి సినిమాను లైటర్ వీన్లో నడిపించడం వల్ల సీరియస్ గా కథను మలుపు తిప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు మరీ సిల్లీగా అనిపిస్తాయి. కామెడీ సినిమాలో లాజిక్స్ పట్టించుకోకూడదన్న మాట వాస్తవమే కానీ.. ఇందులోని వ్యవహారం మాత్రం మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఒక వైపు మరదలి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటే హీరో తన కాబోయే తోడల్లుడిని తీసుకుని యూరప్ ట్రిప్ వేయడమేంటో అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్లిద్దరూ వీళ్లను వదిలేయడం.. వేరే పెళ్లికి రెడీ అయిపోవడం.. వాళ్లకు కాబోయే భర్తలు.. హీరోలు అంతా కలిసి ఒక ఇంటికి చేరడం.. అక్కడ కన్ఫ్యూజింగ్ కామెడీ.. ఇదంతా కూడా ఊరికే క్లైమాక్స్ ముంగిట గ్యాప్ ఫీలింగ్ వ్యవహారంలా అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్లు నవ్వించినా కూడా.. కథ మరీ సిల్లీగా సాగడంతో ద్వితీయార్ధం అంత ఎంగేజింగ్ గా అనిపించదు. ప్రథమార్ధంలో బాగా నవ్వించారన్న సాఫ్ట్ కార్నర్ తో పెద్ద మనసు చేసుకుని సెకండాఫ్ ను లాగించేయడం తప్ప చేసేదేమీ లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘ఎఫ్-2’లో బోలెడంత ఫన్ ఉంది. అలాగే కొంచెం ఫ్రస్టేషన్ కూడా తప్పదు.
నటీనటులు:
ముందే అన్నట్లుగా ఈ చిత్రానికి వెంకీ నటన ప్రత్యేక ఆకర్షణ. చాన్నాళ్ల తర్వాత తన కామెడీ టైమింగ్ చూపించే అవకాశం రావడంలో వెంకీ రెచ్చిపోయి నటించాడు. అట్టా ఏడిపించకపోతే దాని కడుపున ఒక కాయ కాయించొచ్చుగా అని అన్నపూర్ణ అంటే.. ‘‘24 గంటలూ మీరిట్టా నా ఇంట్లో పడి ఉంటే కాయెట్టా కాయిస్తా మీ తలకాయ్’’ అంటూ వెంకీ ఫ్రస్టేషన్ తో చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు.. వెంకీ కామెడీ టైమింగ్ ఎలాంటిదో చెప్పడానికి. తన పాత సినిమాల్లోని రెఫరెన్సులతో తన మీద తనే జోకులు వేసుకుంటూ వెంకీ భలేగా ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమాలో వెంకీ లుక్ కూడా బాగుంది. వరుణ్ తేజ్ పర్వాలేదు. హైదరాబాదీ కుర్రాడిగా తెలంగాణ యాసతో మేనేజ్ చేయడానికి వరుణ్ కష్టపడ్డాడు కానీ.. అతడికా యాస అంతగా సూటవ్వలేదు. అందులో నిలకడ లేకపోయింది. తమన్నా.. మెహ్రీన్ కౌర్ నటన పరంగా ఎలాంటి ముద్ర వేయలేదు. కానీ తమ గ్లామర్ షోతో ఇద్దరూ బాగానే మెప్పించారు. అందులో ఇద్దరూ కలిసి కనిపించిన ఒక పాటలో పోటీ పడి అందాల ప్రదర్శన చేశారు. ప్రకాష్ రాజ్ ద్వితీయార్ధమంతా కనిపించాడు కానీ.. ఆయన పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. వరుణ్ ఫ్రెండు పాత్రలో ప్రియదర్శి బాగానే నవ్వించాడు. వెన్నెల కిషోర్ ను అనిల్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. హీరోయిన్ల తల్లిగా ప్రగతి ఎంటర్టైన్ చేసింది. రఘుబాబు కామెడీ ఆకట్టుకుంటుంది. అన్నపూర్ణ.. వై.విజయ తమ పరిధిలో బాగానే చేశారు.
సాంకేతికవర్గం:
ఈ మధ్య పేలవ ఫాంలో కొనసాగుతున్న దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎఫ్-2’లోనూ మెప్పించలేకపోయాడు. సంగీతానికి పెద్దగా ప్రాధాన్యమున్న సినిమా కాకపోవచ్చు కానీ.. పాటల్లో ఒక్కటి కూడా ప్రత్యేకంగా అనిపించదు. మళ్లీ వినాలనిపించేలా లేదు. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా సాగిపోతుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగానే సాగింది. నిర్మాణ విలువలు ఓకే. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ఈ తరంలో క్లాస్-మాస్ అని తేడా లేకుండా అందరినీ అలరించేలా కామెడీ పండించడంలో తాను ముందుంటానని అతను మరోసారి చాటి చెప్పాడు. భార్యాబాధితుల కష్టాల్ని వినోదాత్మకంగా చెప్పడంలో అనిల్ విజయవంతమయ్యాడు. అతడి మాటలు భలేగా పేలాయి. భార్య అడుగులకు మడుగులొత్తుతున్న వ్యక్తిని చూసి.. ‘‘వీడెవడు మన ఆఫీస్ టేబుల్ మీద రబ్బర్ స్టాంపులా ఉన్నాడు’’ అనడం.. ‘‘మా అమ్మాయి నిప్పు’’ అని అత్త అంటే ‘‘అందుకేనా నా కొంప అంటించారు’’ అని అల్లుడు బదులివ్వడం.. ఇలా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే కామెడీ డైలాగులు చాలానే ఉన్నాయి. ఐతే కామెడీ మీద దృష్టిపెట్టి కథను సరిగా తీర్చిదిద్దుకోకపోవడం.. ద్వితీయార్ధాన్ని మరీ సాధారణంగా నడిపించడంతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశాన్ని అనిల్ కోల్పోయాడు.
చివరగా: ఎఫ్-2.. సగం ఫన్.. సగం ఫ్రస్టేషన్
రేటింగ్-2.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre