రెండు నెలల ముందు వరకు అక్కినేని అఖిల్ రెండో సినిమా.. హను రాఘవపూడితోనే అన్నది పక్కా. ఇద్దరూ కథా చర్చల్లో పాల్గొన్నారు. స్క్రిప్టు కూడా ఓకే అయింది. ఇక ప్రకటన మాత్రమే తరువాయి అనుకుంటూ వచ్చారంతా. అఖిల్ కూడా ఇలాగే చెప్పాడు. కానీ ఉన్నట్లుండి కథ అడ్డం తిరిగింది. హను.. అఖిల్ కు టాటా చెప్పేశాడు. నితిన్ తో సినిమా మొదలుపెట్టాడు. మరోవైపు అఖిల్.. విక్రమ్ కుమార్ తో సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఐతే అఖిల్.. హనుతో సినిమా చేయకపోవడానికి కారణమేంటన్నది తెలిసిందే. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ను 14 రీల్స్ వారికి చేసిన హను.. తర్వాతి సినిమాను కూడా వారికే కమిటయ్యాడు. కానీ అఖిల్ ఆ బేనర్లో సినిమా చేయడానికి అంగీకరించలేదు.
ఇదిలా ఉంటే.. అఖిల్ కోసం వచ్చిన విక్రమ్ కుమార్ కు నిజానికి మరో బేనర్లో కమిట్మెంట్ ఉంది. అది ప్రెస్టీజియస్ ‘గీతా ఆర్ట్స్’ బేనర్లో కావడం విశేషం. బన్నీతో విక్రమ్ సినిమా గురించి చాన్నాళ్ల నుంచే ప్రచారం జరుగుతోంది. ఐతే అఖిల్ రెండో సినిమా ఎటూ తేలకుండా రోజులు గడిచిపోతుండటంతో విక్రమ్ ను పిలిచి తన చిన్న కొడుకుతో సినిమా చేయమన్నాడు నాగ్. కానీ గీతా ఆర్ట్స్ బేనర్ తో కమిట్మెంట్ గురించి చెప్పగా.. నాగ్ స్వయంగా అల్లు అరవింద్ తో మాట్లాడి ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టించి తమ బేనర్లో విక్రమ్ సినిమా చేయడానికి ఒప్పించాడట. మొత్తానికి వేరే కమిట్మెంట్ వల్ల హను అఖిల్ తో సినిమా చేయలేకపోగా.. విక్రమ్ విషయంలో కమిట్మెంట్ బ్రేక్ చేయించి మరీ కొడుకుతో సినిమా చేయిస్తున్నాడు నాగ్. అదేదో హను విషయంలో నాగ్ చేయలేకపోవడమే ఆశ్చర్యం. కానీ అందరితోనూ సంబంధాలు ఒకేలా ఉండవు కదా.