మీడియా మధ్య పోటీ అనివార్యమైన పరిస్థితుల్లో వార్తలు కూర్చే క్రమంలో పేరుపొందిన పత్రికా సంస్థలు కూడా నిరాధార వార్తలను ఆశ్రయించడం అనే కొత్త పోకడ అనవసర ప్రచారాలకు దారి తీస్తోంది. మొన్నామధ్య పవన్ కళ్యాణ్ జనసేనకు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తమ మద్దతు తెలిపారంటూ మంచి సర్కులేషన్ ఉన్న ఒక ఇంగ్లీష్ డైలీ ప్రచురించడంతో అభిమానులు చదివి షాక్ తిన్నారు. తీరా అది ఫేక్ అకౌంట్ల ద్వారా ఎవరో పోస్ట్ చేసినవి అని తెలుసుకుని నిట్టూర్చారు. కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా అంత పెద్ద పత్రిక ఇలా చేయటం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఇప్పుడు అదే పత్రిక మళ్ళి విలువలకు తిలోదకాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి మెగా డాటర్ ను టార్గెట్ చేయటం విశేషం. ఒక మనసు సినిమా ద్వారా పరిచయమైన నీహారిక అందులో తనతో నటించిన హీరో నాగ శౌర్యతో ప్రేమలో ఉందని త్వరలో వివాహం కూడా అవుతుందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. వాటిని ఇద్దరూ ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాక తెలుగు మీడియాలో దానికి ప్రాచుర్యం ఆగిపోయింది.
కానీ ఇప్పుడా పత్రిక నీహారిక నాగ శౌర్య తమ రిలేషన్ కు గుడ్ బై చెప్పేశారని కెరీర్ మీద ఫోకస్ పెట్టడం కోసం తమ బంధానికి స్వస్తి పలికారని ఉటంకిస్తూ పెద్ద హెడ్ లైన్ లో ఫోటోలతో సహా ప్రచురించేసింది. దానికి నీహారిక వరుసగా మూడు సినిమాలు సైన్ చేయడాన్ని కారణంగా చూపించిన వైనం కూడా విచిత్రంగా ఉంది. నిజానికి హ్యాపీ వెడ్డింగ్ పూర్తి చేసాక నీహారిక ఇంకా ఏ సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు. మరో వింత ఏంటంటే మెగా ఫామిలీ మెంబెర్స్ సైతం పెళ్లి కన్నా ముందు కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయటం మీద దృష్టి పెట్టమని చెప్పారట. ఇది ప్రెస్ ఆర్టికల్ కావడంతో ఎక్కువ జనానికి చేరిపోయింది. దీంతో నీహారికతో పాటు నాగ శౌర్య దీన్ని చదివి షాక్ అయినట్టు సమాచారం. అయినా ఆధారాలు లేకుండా తాముగా వ్యక్తిగతంగా చెప్పకుండా యు ట్యూబ్ ఛానెల్స్ తరహాలో ఇలా పత్రికలు కూడా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే విశ్వసనీయత ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించడం సబబే. ఒకే నెలలో ఇది రెండో సారి కావడంతో ఇకపై ఆ పత్రికలో వచ్చే వాటిని నమ్మాలా వద్దా అని చెక్ చేసుకుని పాఠకులు ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేలా ఉంది.