ఒక్క చాన్స్ ఇప్పించరూ... ప్లీజ్!

Update: 2019-02-20 06:39 GMT
ఒక్క సినిమా హిట్ అయితేనే హీరోయిన్స్ ని పట్టుకొలేం...ఎందుకంటే వారి డిమ్యాండ్ అంతలా పెరిగిపోతుంది. మరి అలాంటిది వరుసగా మూడు సినిమాలు హిట్ అయితే ఇక ఆ భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అయితే అటువంటిది ఏమీ లేదు...మీరు రిక్వెస్ట్ చేసి, మీరు సిఫార్సు చేసి ఒక్క చాన్స్ ఇప్పించరూ ప్లీజ్ అంటుంది ఒక టాలీవుడ్ ముద్దు గుమ్మ . ఇంతకీ ఎవరు ఈ భామ...హ్యాట్రిక్ హిట్స్ వచ్చినా అవకాశాలు లేకపోవడం ఏంటి? అనేగా మీ కన్ఫ్యూషన్...అయితే ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి...అసలు మ్యాటర్ ఏంటి మీకే క్లియర్ గా... క్లారిటీగా అర్ధం అయిపోతుంది.

రష్మిక మందన! ఛలో అంటూనే అందరికీ తన అభినయంతో హాయ్ అంటూ పలకరించిన ఈ బ్యూటీ... గీతాగోవిందంతో ఇండస్ట్రీలో తన ప్లేస్ ని పదిలం చేసుకుంది. ఇక దేవదాస్ సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇక వెను తిరిగి చూడవలసిన పనిలేదు ఈ భామకి. ఇటు తెలుగు, అటు కన్నడంలో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. మరి అదేంటి ఒక్క చాన్స్ ఇప్పించరూ అని అంటుంది అంటున్నారు... ఎందుకు అంటుంది ఈ భామ అంటే... ఆమెకు తమిళంలో అవకాశాలు కావాలట... అందులో ముఖ్యంగా ఇలయదళపతి విజయ్ సరసన నటించాలి అని ఆశగా ఉందట. ఈ మేరకు తమిళ ఇండస్ట్రీతో చర్చలు కూడా జరుపుతుంది అని సమాచారం. అయితే తాజాగా ఆమె విజయ్ సినిమాలో చాన్స్ దక్కించుకుంది అని న్యూస్ అయితే వచ్చింది కానీ, అవన్నీ రూమర్స్ అని, అందులో ఏమాత్రం నిజం లేదు అని స్పష్టం అయ్యింది. మరో పక్క ఈ మధ్య ఆమె సోషియల్ మీడియాలో చాట్ లో ప్రేక్షకులతో మాట్లాడింది...

ఇక ఆ చాట్ లో "మీరు తమిళ సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు" అని ఒక అభిమాని అడగగా... నాకు చెయ్యాలి అనే ఉంది. కానీ అవకాశాలు రావడంలేదు... మీరు సిఫార్సు చేసి ఒక్క చాన్స్ ఇప్పించండి పీజ్ అంటూ అతన్ని ఆట పట్టించింది. అయితే సరదాగా అడిగినా ఆమె మాటల్లో ఆమె తమిళంలో అవకాశం కోసం ఎంత ట్రై చేస్తుందో అర్ధం అవుతుంది అని చెప్పవచ్చు. మరి ఆమె కోరుకుంటున్న తమిళంలో అవకాశం త్వరలోనే ఆమెకు వస్తుంది అని ఆశిద్దాం.
Tags:    

Similar News