ఫోటో స్టొరీ: దడదడలాడిస్తున్న దంగల్ బ్యూటీ

Update: 2019-02-10 06:04 GMT
చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫాతిమా సనా షేక్ టీనేజ్ లో ఒకటి ఆరా హిందీ సినిమాల్లో నటించింది కానీ ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం 'దంగల్'. ఈ అమీర్ ఖాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.  ఈ సినిమాలో అమీర్ కూతురిగా గీతా ఫోగాట్ పాత్రలో నటించి ఫాతిమా అందరినీ మెప్పించింది. దీంతో ఫాతిమాకు ఆఫర్లు వెల్లువెత్తాయి.  వెంటనే అమీర్ నెక్స్ట్ ఫిలిం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' లో కూడా అవకాశం వచ్చిందిగానీ ఆ సినిమా బోల్తా కొట్టింది. అలా అని ఫాతిమా స్పీడ్ ఏమీ తగ్గలేదు. సినిమాలే కాకుండా ఈ భామ గ్లామరస్ ఫోటోషూట్లకు కూడా కేరాఫ్ అడ్రెసే.

అందుకే ఈ బ్యూటీకి ఇన్స్టాలో 1.8 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.  ఒకటీ అరా సినిమాలు చేసిన భామలకు ఈ రేంజ్ ఫాలోయింగ్ చాలా ఎక్కువని చెప్పుకోవాలి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాతిమా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫల్గుణి షేన్ పీకాక్ అనే డిజైనర్ వేర్ బ్రాండ్ దుస్తులు ధరించి ఫోటోషూట్ చేసింది ఈ అమ్మడు.  వెనక.. పక్కన భారీ ఆర్క్ లైట్స్.. మధ్యలో చెట్ల పచ్చదనం.. ఒకవైపు మెల్లగా పైకి వస్తున్న పొగ.. అసలు పోజే అదిరిపోయింది.

అమ్మడు స్టైల్ గా నిలబడడమే కాదు.. బోల్డ్ గా క్లీవేజ్ షో కూడా చేసేసింది.  తన డ్రెస్..  కాన్ఫిడెంట్ గా నిలబడిన విధానం అన్నీ చూస్తుంటే ఫ్యూచర్ లో స్టార్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఫాతిమా త్వరలో 'దంగల్' లో తనకు సోదరిగా నటించిన సాన్యా మల్హోత్రాతో కలిసి ఒక సినిమాలో నటించనుంది. 
Tags:    

Similar News