మా` కోసం..మీ ఓటు నాకే వేయ్యండి! గ‌ణేష్ బండ్ల‌

Update: 2021-09-25 16:30 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో నిర్మాత బండ్ల గ‌ణేష్ స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌ల‌ర్ సెక్ర‌ట‌రీ ప‌దవిగా బండ్ల పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్-మంచు విష్ణు ప్యాన‌ల్ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో గ‌ణేష్ ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ముందుగా బండ్ల గ‌ణేష్- ప్ర‌కాష్ రాజ్ ప్యానల్ కి మ‌ద్ధ‌తిచ్చినా అదే ప్యాన‌ల్లో కి జీవితా రాజ‌శేఖ‌ర్ ఎంట్రీ ఇవ్వ‌డంతో బండ్ల త‌ప్పుకున్నారు. అప్ప‌టి నుంచి `మా` పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఎవ‌రికి వారు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించికునే ప‌నిలో బిజీ అయ్యారు.

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ఎవ‌రికి వారు కుయుక్తులు ప‌న్నుతూ ముంద‌కు సాగిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో బండ్ల గ‌ణేష్ ట్విట‌ర్ వేదిక‌గా మా ఓట‌ర్ల ను అభ్య‌ర్ధించారు. `ఒకే ఒక్క ఓటు. మా కోసం . మ‌నందరి కోసం. మా తరుపున ప్ర‌శ్నించ‌డం కోసం` అని త‌న‌దైన శైలిలో స్పందించారు. ప్రెసిడెంట్.. వైస్ ప్రెసిడెంట్..జాయింట్ సెక్ర‌ట‌రీ తో పాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్ స‌భ్యులుగా మీకు న‌చ్చిన వారిని ఎంచుకోండి. కానీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి మాత్రం నాకే కట్ట‌బెట్టండి` అని అభ్య‌ర్ధించారు. మ‌రి ఓటర్లు గ‌ణేష్ కి ఎంత వ‌ర‌కూ మ‌ద్ద‌తిస్తారో చూడాలి. ఇప్ప‌టికే విష్ణు-ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యుల్ని ప్ర‌క‌టించి ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేయండ‌ని ఓట‌ర్ల మీద‌కి వ‌దిలేసారు.

లంచ్ పార్టీలు..డిన్న‌ర్ పార్టీలు..మందు పార్టీలు ఇప్ప‌టికే రెండు పార్టీలు ఇచ్చేసాయి. ఇంకా ఎన్నిక‌ల‌కు ప‌దిహ‌ను రోజులు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో పార్టీలు కూడా గ‌ట్టిగా జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. మునుపెన్నుడు ఇలాంటి పోక‌డ `మా `లో క‌నిపించ‌లేదు. కేవ‌లం ఎన్నిలు వారం రోజుల ముందు హ‌డావుడి త‌ప్ప‌..అంత‌కు మించి రూపాయి ఖ‌ర్చు అయ్యేది కాదు. కానీ ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్నే `మా `ఎన్నిక‌లు త‌ల‌పించ‌డం విశేషం. అక్టోబ‌ర్ 10 న ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఈసీ నోటిఫికేష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.




Tags:    

Similar News