మెగా 'గని' అప్పుడే ఫిక్స్ అయ్యాడు

Update: 2021-01-28 05:14 GMT
మెగా గని అప్పుడే ఫిక్స్ అయ్యాడు
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ 'గని' సినిమా విడుదల తేదీ విషయంలో యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఫస్ట్ లుక్‌ ను విడుదల చేసిన యూనిట్‌ సభ్యులు విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ను జులై 30 తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మొన్నటి వరకు మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వచ్చింది. కాని ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం  అవుతున్న కారణంగా జులై 30వ తారీకున సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు.

ఈ సినిమాకు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌ ల ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. ఇప్పటికే విడుదలైన బాక్సర్‌ లుక్‌ లో వరుణ్‌ తేజ్‌ ఆకట్టుకున్నాడు. గని సినిమా తో పాటు వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా  ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News