బాలీవుడ్ టు గ్లోబల్ బ్యూటీగా మారిన ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం దేశవిదేశాల్లో ఇండియన్ బ్యూటీ ఖ్యాతిని పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఇండియన్ సెలబ్రిటీలలో ప్రియాంక ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. అయితే ప్రియాంక చోప్రా ఎంతటి టాలెంటెడ్ యాక్ట్రెస్ అనేది అందరికి తెలిసిందే. కానీ టాలెంట్ సోషల్ మీడియాలో కూడా ఎంతో అందంగా ప్రదర్శిస్తుంది. నిజానికి సోషల్ మీడియాను ఎలా వాడాలో ప్రియాంకకు బాగా తెలుసు. తన కోట్లాది అభిమానులను అలరించడానికి ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా అమ్మడు ఆస్ట్రేలియా 2021 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ నుండి కొన్ని అద్భుతమైన ఫోటోలు షేర్ చేసింది.
ఈ 'స్కై ఈజ్ పింక్' బ్యూటీ వోగ్ ఆస్ట్రేలియా ఫోటోషూట్ నుండి లేటెస్ట్ పిక్స్ షేర్ చేసేందుకు ఇంస్టాలో మెరిసింది. జూన్ 2021 ఎడిషన్ 'గ్లోబల్ సూపర్ పవర్' మ్యాగజైన్ కోసం.. ప్రియాంక వోగ్ ఆస్ట్రేలియా కవర్ ఫోటోకు వివిధ పోజులిచ్చింది. ఈ ఆస్ట్రేలియా వోగ్ కవర్ ఫోటోలో ప్రియాంక అల్ట్రా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలో గ్లోబల్ బ్యూటీ.. డ్రెస్ చుట్టూ బ్లాక్ కలర్ లైనప్ కలిగి ఉంది. అది వైట్ డ్రెస్ లో ప్రియాంక అందం రెట్టింపు అయ్యేలా చేస్తోంది. అలాగే ప్రియాంక అందమైన మేకప్.. బ్యూటీఫుల్ డ్రెస్ అంచులను ఓపెన్ చేసినప్పుడు పెదాల పై లిప్ స్టిక్ - డ్యూ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంది. మొత్తానికి వయ్యారి అందాలను హైలైట్ చేయడానికి అమ్మడు బ్రాండ్ బుల్గారి నుండి స్టేట్మెంట్ ఆభరణాలను ధరించడం మనం చూడవచ్చు. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగతుంది. ఈ విషయం పై ప్రియాంక ఎప్పటినుండో బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కృషి చేస్తూనే ఉంది. ఈ అమ్మడు ఇప్పటికే గివ్ఇండియా పేరుతో నిధుల సేకరణ ప్రారంభించింది. ఇప్పటివరకు ప్రియాంక ఇండియాలో తగిన వైద్య సదుపాయాలు అందించడానికి తనవంతుగా 1మిలియన్ డాలర్స్ పైగా సేకరించినట్లు సమాచారం. ఈ సందర్బంగా వోగ్ ఆస్ట్రేలియాతో ప్రియాంక మాట్లాడుతూ.. "స్పష్టంగా చెప్పాలంటే.. మనమందరం సురక్షితంగా ఉండే వరకు ఎవరూ సురక్షితంగా లేరనే అనుకోవాలి. గ్లోబల్ కమ్యూనిటీగా, మనం అందరం ఆరోగ్యంగా అడుగు పెట్టడానికి.. మనం సహాయం పొందే చోట సహాయం చేయడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలనేది నా నమ్మకం." అని చెప్పుకొచ్చింది బ్యూటీ. ప్రస్తుతం ప్రియాంక మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.