సినీ ప్రియులకి శుభవార్త .. ఇక పై ఇంటి నుండే ఆహారం తీసుకొని వెళ్లొచ్చు !

Update: 2019-12-10 06:08 GMT
సినిమా ప్రస్తుత రోజుల్లో ఉన్న అతి పెద్ద వినోదాత్మకం అయిపోయింది. ప్రతి ఒక్కరూ రోజంతా పని చేసి అలసి పోసి , ఇంటికి వచ్చి కాసేపు సినిమా చూసి రిలాక్స్ అవుతున్నారు. అలాగే వారం మొత్తం డ్యూటీలతో పిచ్చెక్కిపోయిన వారు వీకెండ్ లో మల్టీ  ప్లెక్సీల వైపు పరుగులు తీస్తున్నారు. కానీ , ఇదే అదును గా భావించిన థియేటర్ల యాజమాన్యం .. బయటకి నుండి ఎటువంటి ఫుడ్ ని కానీ , వాటర్ బాటిల్స్ ని అనుమతించడం లేదు. వంద రూపాయలకు పైగా డబ్బులు పెట్టి టికెట్టు కొనుక్కున్న ఉన్నవారందరూ ఇంటర్వెల్ లో థియేటర్లో వారు అమ్ముతున్న స్నాక్స్ యొక్క రేటు చూసి బెంబేలెత్తిపోతున్నారు. కనీసం వాటర్ బాటిల్ కొందామన్నా కూడా 50 రూపాయల వరకు వసూలు చేస్తారు థియేటర్ వారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే కొత్తగా ఒక రూలు వచ్చేసింది.

దీనిపై అవినీతి నిరోధక కార్యకర్త విజయ్ గోపాల్ కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా హైదరాబాద్ సిటీ పోలీసు వారు ఇకనుండి ప్రజలందరూ ఎటువంటి ఆటంకం లేకుండా తమ ఇంటి నుండే స్నాక్స్ మరియు నీటిని థియేటర్లోకి తీసుకువెళ్లేందుకు అనుమతినిచ్చారు. అలాగే థియేటర్ వారికి కూడా ప్రేక్షకులు తీసుకొని వెళుతున్న ఏ ఒక్క ఆహార పదార్థాన్ని బయట ఆపేందుకు కూడా ఎటువంటి అధికారం లేదని తేల్చి చెప్పారు. అసలు ఈ చట్టం ఇప్పుడు కొత్తగా వచ్చిన అయితే కాదు. సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారం ప్రేక్షకులు సినిమా థియేటర్లో సినిమా చూడడానికి వచ్చినపుడు వారు తీసుకుని వచ్చే ఫుడ్ మరియు వాటర్ బాటిల్ పైన ఎటువంటి ఆంక్షలు విధించకూడదు అని ఉంది అని తెలిపారు.అలాగే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం .. ఓకే స్క్రీన్ ఉన్న థియేటర్ల లో ప్రేక్షకుడికి 3D గ్లాస్ అద్దాలు వాడేందుకు ఎటువంటి చార్జి చేయకూడదు.

అలాగే మల్టీప్లెక్స్ లలో వారు థియేటర్ వారి వద్ద 3-D గ్లాసులు తీసుకోకపోతే వారి సొంత వాటిని తెచ్చుకునేందుకు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకూడదు. మల్టీప్లెక్స్ లో ఈ చట్టానికి విరుద్ధం గా ఎంతో మంది ప్రేక్షకులను లోనికి ఆహారాన్ని తీసుకొని వెళ్ళనీయకుండా తమ రక్షణ వ్యవస్థ కోసం అని సాకులు చెబుతూ ఆపేస్తూ ఉంటారు. అయితే దానికి ప్రధాన కారణం సినిమా హాల్లో వారు కాంట్రాక్ట్ తీసుకున్న వారితో అధిక రేట్లకు కూల్ డ్రింక్స్ మరియు స్నాక్స్ అమ్మించడం వల్ల వచ్చే లాభాలను నష్ట పోకుండా ఉండేందుకు అన్నది అందరికీ తెలిసిన విషయమే.


Tags:    

Similar News